English | Telugu

మెగాస్టార్ తో జ‌గ్గూ భాయ్ ఢీ?

మెగాస్టార్ చిరంజీవి గ‌త చిత్రం `సైరా.. న‌ర‌సింహారెడ్డి`లో వీరా రెడ్డిగా నెగ‌టివ్ షేడ్స్ ఉన్న పాత్ర‌లో అల‌రించారు వెట‌ర‌న్ యాక్ట‌ర్ జ‌గ‌ప‌తి బాబు. క‌ట్ చేస్తే.. త్వ‌ర‌లో మ‌రోమారు చిరుని ఢీ కొట్టేందుకు సిద్ధ‌మ‌వుతున్నార‌ని టాక్.

ఆ వివ‌రాల్లోకి వెళితే.. `ప‌వ‌ర్`, `స‌ర్దార్ గ‌బ్బ‌ర్ సింగ్`, `జై ల‌వ కుశ‌`, `వెంకీమామ‌` చిత్రాల ద‌ర్శ‌కుడు కె.ఎస్. ర‌వీంద్ర (బాబీ) నిర్దేశ‌క‌త్వంలో చిరంజీవి ఓ మెగా ప్రాజెక్ట్ చేయ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. హ్యాట్రిక్ విజ‌యాల నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మించ‌నున్న ఈ భారీ బ‌డ్జెట్ మూవీ.. త్వ‌ర‌లో సెట్స్ పైకి వెళ్ళ‌నుంది. కాగా, ఈ చిత్రంలో ఓ ప్ర‌తినాయ‌కుడి పాత్ర‌లో జ‌గ్గూ భాయ్ న‌టించ‌బోతున్నార‌ని స‌మాచారం. అంతేకాదు.. ఈ పాత్ర‌కి స్పెష‌ల్ మేన‌రిజ‌మ్ కూడా ఉంటుంద‌ని బ‌జ్. త్వ‌ర‌లోనే మెగాస్టార్ - బాబీ కాంబినేష‌న్ మూవీలో జ‌గప‌తిబాబు ఎంట్రీపై క్లారిటీ రానుంది. మ‌రి.. చిరుతో మ‌రోసారి క‌లిసి న‌టించ‌నున్న జ‌గ్గూ భాయ్ ఈ సారి ఎలాంటి ఫ‌లితాన్ని అందుకుంటారో చూడాలి.

కాగా, చిరు - బాబీ కాంబో మూవీకి రాక్ స్టార్ దేవి శ్రీ ప్ర‌సాద్ బాణీలు అందించ‌నున్నారు.