English | Telugu
చంద్రశేఖర్ యేలేటి.. మరో థ్రిల్లర్?
Updated : Mar 19, 2021
దర్శకుడిగా చంద్రశేఖర్ యేలేటిది 18 ఏళ్ళ ప్రస్థానం. ఈ ప్రయాణంలో ఎక్కువగా థ్రిల్లర్ మూవీస్ నే చేశాడీ టాలెంటెడ్ డైరెక్టర్. కాకపోతే.. మిస్టరీ థ్రిల్లర్, యాక్షన్ థ్రిల్లర్.. ఇలా కొద్దిపాటి వేరియేషన్స్ తో ఈ జానర్ లో సినిమాలు చేశాడు యేలేటి. `ఐతే`, `అనుకోకుండా ఒక రోజు`, `ఒక్కడున్నాడు`తో పాటు రీసెంట్ గా రిలీజైన `చెక్` కూడా థ్రిల్లర్ టచ్ తో రూపొందిన చిత్రాలే.
కట్ చేస్తే.. తన నెక్స్ట్ వెంచర్ ని కూడా ఇదే జోనర్ లో చేసే దిశగా ప్రయత్నాలు చేస్తున్నాడట చంద్రశేఖర్ యేలేటి. అంతేకాదు.. ఈ సినిమాని బ్లాక్ బస్టర్స్ హ్యాట్రిక్స్ ని అందించిన మైత్రీ మూవీ మేకర్స్ లో చేయబోతున్నాడట. ప్రస్తుతం స్క్రిప్ట్ దశలో ఉన్న ఈ చిత్రానికి సంబంధించి పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి. `అనుకోకుండా ఒక రోజు` తరహాలో ఇది కూడా ఓ ఫిమేల్ సెంట్రిక్ ఫిల్మ్ గా తెరకెక్కనుందనే మాటలు వినిపిస్తున్నాయి.
మరి.. గత కొంతకాలంగా సరైన విజయం లేని చంద్రశేఖర్ యేలేటికి రాబోయే సినిమాతోనైనా ఆ ముచ్చట తీరుతుందేమో చూడాలి.