English | Telugu

మెగాస్టార్‌కి జోడీగా సోనాక్షి సిన్హా?

మెగాస్టార్ చిరంజీవి ప్ర‌స్తుతం కొర‌టాల శివ డైరెక్టోరియ‌ల్ `ఆచార్య‌`ని పూర్తిచేసే ప‌నిలో ఉన్నారు. ఆపై మోహ‌న్ రాజా డైరెక్టోరియ‌ల్ `లూసిఫ‌ర్` రీమేక్ ని ప‌ట్టాలెక్కించ‌నున్నారు. స‌ద‌రు రీమేక్ పూర్త‌య్యేలోపే.. `ప‌వ‌ర్` డైరెక్ట‌ర్ బాబీ కాంబినేష‌న్ లో ఓ మాస్ ఎంట‌ర్ టైన‌ర్ ని సెట్స్ పైకి తీసుకెళ్ళే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని టాక్. హ్యాట్రిక్ బ్లాక్ బ‌స్ట‌ర్స్ ని అందించిన మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని ఎంతో ప్ర‌తిష్ఠాత్మ‌కంగా నిర్మించ‌నుంది.

ఇదిలా ఉంటే.. ఈ భారీ బ‌డ్జెట్ మూవీలో చిరంజీవికి జోడీగా బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హాని న‌టింప‌జేసే ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయ‌ని స‌మాచారం. క‌థానాయిక పాత్ర‌కి సోనాక్షి అయితేనే బావుంటుంద‌ని బాబీ అభిప్రాయ‌ప‌డ‌డంతో.. చిరు కూడా ఓకే చెప్పార‌ట‌. ప్ర‌స్తుతం ఈ మేర‌కు సోనాక్షితో సంప్ర‌దింపులు జ‌రుగుతున్నాయ‌ని క‌థ‌నాలు వ‌స్తున్నాయి. త్వ‌ర‌లోనే చిరు - బాబీ కాంబినేష‌న్ మూవీలో సోనాక్షి సిన్హా ఎంట్రీపై క్లారిటీ వ‌స్తుంది.

కాగా, ఇప్ప‌టికే సోనాక్షి ద‌క్షిణాదిలో `లింగ‌` (2014) చిత్రం చేసింది. స‌ద‌రు పిరియ‌డ్ డ్రామాలో సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్ కి జంట‌గా సోనాక్షి ద‌ర్శ‌న‌మిచ్చింది.