English | Telugu

బోయపాటిని కెలుకుతున్న బన్నీ?

ఇదిగో డేట్స్ ఇచ్చాడు...రోపో మాపో సినిమా స్టార్ట్ అయిపోతుంది అని బోయపాటి తెగ సందడి చేశాడు. కానీ తెరవెనుక విషయం వేరేఉందని టాక్. లెజెండ్ తర్వాత ఇప్పటి వరకూ బయటకు రాని బోయపాటి ఆ హీరో ఈ హీరో వెనుక తిరిగి చివరికి అల్లు అర్జున్ డేట్స్ సంపాదించాడు. ఈ కాంబినేషన్ బాగుందని అంతా అన్నారు. కానీ అది కార్యరూపం దాల్చే రోజే దగ్గర్లో కనిపించడం లేదు.

గతంలో సింహా హిట్ తర్వాత మహేష్, రామ్‌చరణ్‌లతో కథల విషయంలో ఇబ్బందిపడిన బోయపాటి, ఎన్టీఆర్‌తో ‘దమ్ము’ తీసి బోల్తాపడ్డాడు. ప్రస్తుతం ‘లెజెండ్’ రిలీజై సంవత్సరంపైనే అవుతున్నా...మళ్లీ చెర్రీకోసం ట్రై చేసి కుదరక బన్నీకి ఫిక్సయ్యాడు. ‘సన్నాఫ్ సత్యమూర్తి’ మూవీ రిజల్ట్‌తో నిరాశపడిన బన్నీ...ఆచితూచి అడుగేయాలని ఫిక్సయ్యాడట. దీంతో బోయపాటిపై ప్రెజర్ పెడుతున్నాడని టాక్.

అక్కడ మార్పులు చేయాలి, ఇక్కడ మార్పులు చేయాలని బోయపాటిపై ఒత్తిడి తెస్తున్నాడట. దీంతో ఈ ప్రాజెక్టు పట్టాలెక్కేవరకూ డౌటే అనే గుసగుసలు వినిపిస్తున్నాయి. అయినా హీరో వేలుపెట్టిన ఏ ఒక్క సినిమా కూడా ఇప్పటి వరకూ హిట్టవలేదన్న సంగతి బన్నీకి తెలుసో లేదో?