English | Telugu
సూర్య-బోయపాటి కాంబినేషన్ లో పాన్ ఇండియా మూవీ!!
Updated : Jun 15, 2021
దర్శకుడు బోయపాటి శ్రీను ప్రస్తుతం నటసింహం బాలకృష్ణ హీరోగా 'అఖండ' సినిమా తెరకెక్కిస్తున్నాడు. 'సింహా', 'లెజెండ్' వంటి బ్లాక్ బస్టర్స్ తరువాత బాలయ్య-బోయపాటి కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో అఖండపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ.. దసరాకి విడుదలయ్యే అవకాశముంది. ఇక ఈ సినిమా తరువాత బోయపాటి చేయబోయే ప్రాజెక్ట్ పై రకరకాల న్యూస్ వినిపిస్తున్నాయి. ఆయన తన తదుపరి సినిమా కోలీవుడ్ స్టార్ హీరో సూర్యతో చేయబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది.
నిజానికి అఖండ తరువాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో బోయపాటి సినిమా ఉంటుందని న్యూస్ చక్కర్లు కొట్టాయి. అయితే బన్నీ.. పుష్ప, ఐకాన్ సినిమాలతో పాటు ఇతర డైరెక్టర్లతో ఉన్న కమిట్మెంట్స్ వలన బోయపాటికి డేట్స్ ఇవ్వలేకపోయాడట. దీంతో బోయపాటి.. సూర్య కోసం ఒక కథ రెడీ చేసి.. ప్రొడ్యూసర్ దిల్ రాజుతో చర్చించి.. సూర్యకి వినిపించాడట. సూర్య కూడా ఈ ప్రాజెక్ట్ చేయడానికి ఆసక్తిగా ఉన్నాడని సమాచారం.
కాగా, దిల్ రాజు ఇప్పటికే తెలుగు-తమిళ కాంబినేషన్ లో క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తున్నాడు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, తమిళ్ స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో ఓ పాన్ ఇండియా మూవీతో పాటు.. తమిళ్ స్టార్ హీరో విజయ్, టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో ఓ పాన్ ఇండియా మూవీ నిర్మిస్తున్నాడు. ఇప్పుడు బోయపాటి-సూర్య కాంబినేషన్ లో మూవీ సెట్ అయితే ఇది కూడా పాన్ ఇండియా మూవీగా తెరకెక్కే అవకాశముంది.