English | Telugu

మరో క్రేజీ ప్రాజెక్ట్ లో సమంత.. రాజీ పాత్రతో సినిమా!!  

ఇటీవల విడుదలైన ‘ది ఫ్యామిలీ మ్యాన్2’ వెబ్ సిరీస్ పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. ముఖ్యంగా ఇందులో సమంత నటనకు ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ సిరీస్ తో ఆమె నేషనల్ వైడ్ గా క్రేజ్ తెచ్చుకుంది. రాజీ పాత్రలో ఆమె ఒదిగిపోయిన తీరుకి అందరూ ఫిదా అయిపోయారు. అయితే రాజీ పాత్ర లీడ్ రోల్ లో త్వరలో సమంత సినిమా చేయనుందని సమాచారం.

‘ది ఫ్యామిలీ మ్యాన్2’లో ప్రాణాలు తీయడానికి వెనుకాడని క్రూరమైన తీవ్రవాది రాజీ పాత్రలో సమంత కనిపించింది. అయితే, రాజీ తీవ్రవాదిగా మారడానికి గల కారణాలను ఈ సిరీస్ లో చూపించలేదు. అందుకే ఇప్పుడు రాజీ పాత్ర‌ని కేంద్ర బిందువుగా చూపిస్తూ.. ఓ స్ర్కిప్ట్‌ చేయాలని దర్శక ద్వయం రాజ్‌-డీకే భావిస్తున్నారట. సమంతకు ‘ద ఫ్యామిలీ మ్యాన్‌-2’ కథ వివరించినప్పుడే.. రాజీ పాత్రతో ఓ మూవీ చేస్తామని మాట ఇచ్చారట. ఓ సాధారణ అమ్మాయి తీవ్రవాదిగా మారడానికి గల కారణాలేంటి? అనేది ఈ సినిమాలో చూపిస్తారట.

కాగా సమంత ప్రస్తుతం తెలుగులో ‘శాకుంతలం’, తమిళంలో ‘కత్తు వాకుల రెండు కాదల్‌’ చిత్రాల్లో నటిస్తోంది. పెళ్లి తరువాత విభిన్న చిత్రాలు, పాత్రలతో అలరిస్తున్న సమంత.. ఇటీవల ఓ స్టార్ హీరో సినిమాలో హీరోయిన్ గా నటించేందుకు ఓ నిర్మాత భారీ రెమ్యునరేషన్ ఆఫర్ చేసినా రిజెక్ట్ చేసిందని సమాచారం.