English | Telugu
సంక్రాంతికి కాదు.. మహాశివరాత్రికి `భీమ్లా నాయక్`?
Updated : Aug 20, 2021
`వకీల్ సాబ్`తో రి-ఎంట్రీ ఇచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. త్వరలో `భీమ్లా నాయక్`గా పలకరించబోతున్న సంగతి తెలిసిందే. మాలీవుడ్ బ్లాక్ బస్టర్ `అయ్యప్పనుమ్ కోషియుమ్`కి రీమేక్ గా రూపొందుతున్న ఈ సినిమా కోసం మరోసారి పోలీస్ గా కనిపించబోతున్నారు పవన్.
ఇదిలా ఉంటే.. ఈ సినిమాని 2022 సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల చేయబోతున్నట్లు ఇటీవల మేకర్స్ ప్రకటించారు. లేటెస్ట్ బజ్ ఏంటంటే.. `భీమ్లా నాయక్` పొంగల్ రేసు నుంచి తప్పుకోనుందట. ఆ స్థానంలో.. మెగాస్టార్ చిరంజీవి, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మల్టిస్టారర్ `ఆచార్య` విడుదల కానుందని వినికిడి. ప్రస్తుతం ఈ మేరకు రెండు సినిమాల మేకర్స్ మధ్య చర్చలు సాగుతున్నాయని టాక్. అంతేకాదు.. మహాశివరాత్రి కానుకగా మార్చి 1న `భీమ్లా నాయక్`ని రిలీజ్ చేసే ఆలోచనతో నిర్మాతలు ఉన్నారని అంటున్నారు. త్వరలోనే `భీమ్లా నాయక్` వాయిదాపై క్లారిటీ వస్తుంది.
`భీమ్లా నాయక్`కి సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తుండగా.. త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తున్నారు. రానా దగ్గుబాటి మరో హీరోగా నటిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి తమన్ బాణీలు అందిస్తున్నాడు. పవన్ కి జంటగా నిత్యా మీనన్, రానాకి జోడీగా ఐశ్వర్యా రాజేశ్ కనిపించనున్నారు.