English | Telugu

అనిల్‌ రావిపూడి మూవీలో కొత్త బాలయ్యని చూస్తామట!

అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నట్లు ఇటీవల నటసింహం బాలకృష్ణ ప్రకటించిన సంగతి తెలిసిందే. పటాస్, F2, సరిలేరు నీకెవ్వరు వంటి కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీస్ తో అలరించిన అనిల్ రావిపూడి.. బాలయ్యతో ఎలాంటి మూవీ చేస్తాడోనన్న ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది. అయితే బాలయ్యను అనిల్ చాలా కొత్తగా చూపించనున్నారని టాక్ వినిపిస్తోంది.

అనిల్ రావిపూడి మూవీలో ఇంతకు ముందెన్నడూ చూడని స్టైలిష్‌ లుక్‌ లో బాలయ్య కనిపించనున్నారట. సినిమాలో ఆయన పాత్ర కూడా చాలా ఎనర్జిటిక్ గా ఉంటుందని తెలుస్తోంది. గతంలో పూరి డైరెక్షన్ లో వచ్చిన 'పైసా వసూల్'లో బాలయ్య చాలా కొత్తగా కనిపించి.. డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్, డిఫరెంట్ డైలాగ్ డెలివరీతో ఆకట్టుకున్నారు. ఇప్పుడు అనిల్ రావిపూడి మూవీలో మరింత కొత్తగా కనిపించి అలరిస్తారేమో చూడాలి.

ప్రస్తుతం బాలయ్య బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కనున్న 'అఖండ' మూవీలో నటిస్తున్నారు. దీంతోపాటు గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో ఓ మూవీ చేయనున్నారు. ఇక అనిల్‌ రావిపూడి విషయానికి వస్తే ప్రస్తుతం 'F‌3' ని పూర్తిచేసే పనిలో ఉన్నారు.