English | Telugu
రాజమౌళి దొంగ లెక్కలు
Updated : Dec 23, 2015
బాహుబలి పార్ట్ 1.. దాదాపుగా రూ.600 కోట్లు వసూలు చేసింది. నిజమే. అయితే దాని బడ్జెట్ ఎంత?రాజమౌళి బృందం ముందే చెప్పినట్టు ఈ సినిమాకి నిజంగానే 250 కోట్లు అయ్యాయా? లేదంటే అంతా అంబక్కేనా?కేవలం ఈసినిమాకి హైప్ తీసుకుని రావడానికే.. రాజమౌళి ఇలాంటి దొంగలెక్కలేశాడా? పరిశ్రమ వర్గాల్లో ఇదే హాట్ టాపిక్. ఇటీవల స్టూడెంట్స్ తో జరిగిన ఇంటరాక్టీవ్ సెషల్‌లో బాహుబలి లెక్కలు బయటపెట్టాడు రాజమౌళి. నోరు జారాడో లేదంటే విద్యార్థుల దగ్గర కాకమ్మ లెక్కలు చెబితే బయటపడిపోతామనుకొన్నాడో ఈ సినిమా బడ్జెట్‌కి రూ.22 కోట్లు మాత్రమే అయ్యాయని క్లారిటీగా చెప్పేశాడు.
నిజానికి బాహుబలి విడుదలకు ముందు.. `బడ్జెట్‌లో సగం గ్రాపిక్స్‌కే అయ్యింది `అంటూ టీమ్ మొత్తం ముక్త కంఠంతో అరచింది. అంటే.. బాహుబలి బడ్జెట్ రూ.44 కోట్లేనా? పారితోషికాలతో కలుపుకొంటే బాహుబలి రూ.80 కోట్ల బడ్జెట్ దాటదని.. ట్రేడ్ వర్గాలు ఎప్పుడో లెక్కగట్టాయి. ఇప్పుడు రాజమౌళి మాటలు వింటుంటే.. అదే నిజమనిపిస్తోంది. పైగా పార్ట్ 2లో 40 శాతం షూటింగ్‌తో కలుపుకొని రాజమౌళి వేసిన లెక్కలు ఇవి. పార్ట్ 1 వరకే సరిగ్గా లెక్కేస్తే నిర్మాణ పనుల కింద రూ.50 కోట్లు కూడా ఖర్చయి ఉండవు.
ఇప్పుడు పార్ట్ 2 కోసం రూ.300 కోట్ల బడ్జెట్ కేటాయిస్తున్నామన్న మాట అవాస్తమే అని... అది కేవలం సినిమాకి హైప్ పెంచుకొనేందుకు రాజమౌళి చేస్తున్న అంకెల గారడీ అని స్పష్టంగా అర్థమవుతోంది. ఇక రేప్పొద్దుట బాహుబలి 2కి రూ.300 కోట్లు ఖర్చయ్యిందని రాజమౌళి అరచి గీ పెట్టినా ఎవరూ నమ్మరు.