English | Telugu
చిరుకి షాక్ ఇవ్వబోతున్న పూరి
Updated : Dec 22, 2015
ఆటోజానీపై పూరి జగన్నాథ్ పెంచుకొన్న ఆశలన్నీ గల్లంతయ్యాయి. ఇక చిరంజీవి నుంచి పూరికి పిలుపు రావడం కలే! ఎవరైనా అయితే.. చిరు ఎప్పటికైనా పిలుస్తాడేమో? ఇంకొంత కాలం ఎదురుచూస్తే మంచిదేమో అనుకొంటారు. కానీ అందరిలా ఆలోచిస్తే తాను పూరి ఎందుకు అవుతాడు. అందుకే చిరుకి దిమ్మతిరిగి మైండ్ బ్లాంక్ అయ్యే షాక్ ఇవ్వాలని నిర్ణయించుకొన్నాడు.
అదేంటంటే. ఈ ఆటోజానీ కథకు కొన్ని మార్పులు చేసి... రవితేజతో తెరకెక్కించాలని నిర్ణయించుకొన్నాడు. చిరంజీవి 150వ సినిమా రాకముందే... ఆటోజానీని రవితేజతో పూర్తి చేసి విడుదల చేయాలన్నది పూరి జగన్నాథ్ ఆలోచన. అందుకు సమర్థుడే పూరి. ఎందుకంఏ 40 రోజుల్లో సినిమా షూటింగ్ పూర్తి చేసిన సందర్భాలు పూరి కెరీర్‌లో కోకొల్లలు. మరోవైపు రవితేజ కూడా పూరికి తన సహాయ సహకారాలు అందివ్వాలని నిర్ణయించుకొన్నాడట.
పూరి వల్లే.. రవితేజ స్టార్ గా మారాడు. ఇద్దరూ మంచి మిత్రులు కూడా. పూరి కష్టకాలంలో ఉన్నప్పుడు ఆదుకోవడం తన బాధ్యత అని రవితేజ డిసైడ్ అయ్యాడట. ఇప్పుడు పూరి లక్ష్యం ఒక్కటే... ఆటోజానీని రవితేజతో తీసి, హిట్ కొట్టి - ఇంత మంచి సినిమా నేనెందుకు వదులుకొన్నా..?? అని చిరు ప్రశ్చాత్తాపపడేలా చేయడం. అదే జరిగితే.. చిరు షాక్ తినడం ఖాయం.