English | Telugu

విరాట్‌ను వెనక్కినెట్టి.. కోట్లకు పడగలెత్తబోతున్న ప్రభాస్..!

బాహుబలితో ఇంటర్నేషనల్ సూపర్‌స్టార్‌గా మారారు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. దీంతో మనోడి పేరు ప్రపంచస్థాయిలో మారుమోగిపోతోంది. మరి ఇంత నేమ్, ఫేమ్ ఉన్న వ్యక్తిని కంపెనీలు వదిలిపెడతాయా..? అందుకే ప్రభాస్‌తో తమ బ్రాండ్లను ప్రమోట్ చేయించుకునేందుకు అనేక జాతీయ, అంతర్జాతీయ సంస్థలు క్యూకడుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ మొబైల్ ఫోన్ల కంపెనీ జియోనీ ప్రభాస్‌ను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకుంది.

ఇక నుంచి ప్రభాస్ తమ మొబైల్ సెట్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తారని జియోనీ ఇండియా ప్రకటించింది. ఇప్పటికే జియోనీకి టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, అలియాభట్, శ్రుతిహాసన్, దుల్కర్ సల్మాన్, దిల్జిత్ దోసాంజ్‌లు ప్రమోటర్లుగా వ్యవహరిస్తున్నారు..ఇప్పుడు వీరికి తోడుగా యంగ్ రెబల్‌స్టార్ రంగంలోకి దిగబోతున్నారు. ప్రభాస్‌తో మరికొన్ని కంపెనీలు ఒప్పందం కుదుర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి. ఒకవేళ బాహుబలి వీటికి గ్రీన్‌సిగ్నల్ ఇస్తే ఎండార్స్‌మెంట్ల ద్వారా అత్యధిక ఆదాయాన్ని ఆర్జిస్తున్న టీమిండియా సారథి విరాట్‌ కోహ్లీని క్రాస్ చేయవచ్చేమో అంటూ చర్చించుకుంటున్నాయి ఫిలింనగర్ వర్గాలు.