English | Telugu

బాహుబలి చావు వెనుక కుట్ర ఇదే..?

ప్రపంచ సినీ ప్రేక్షకులందరూ ఏప్రిల్ 28 కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే ఆ రోజు బాహుబలి-2 రిలీజ్ కాబోతోంది. రాజమౌళి సినిమాను విజువల్ వండర్‌గా ఎలా తీర్చిదిద్దాడా అని చూడటం కోసం కాదు..కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనే ప్రశ్నకు సమాధానం కోసం. రెండేళ్ల నుంచి ఈ ప్రశ్నకు జవాబు దొరక్క అభిమానులు జుట్టు పీక్కుంటున్నారు. రీసెంట్‌గా రిలీజైన బాహుబలి-2 ట్రైలర్‌లో నువ్వు నా పక్కనుండగా నన్ను చంపే మగాడు ఇంకా పుట్టలేదు మామా అంటూ ప్రభాస్ డైలాగ్ చెప్పడంతో అంత నమ్మిన కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడా అని అంచనాలు మరింత ఎక్కువయ్యాయి.

అయితే మాహిష్మతి సింహాసనాన్ని అమరేంద్ర బాహుబలి అధిష్టించిన తర్వాత ఆయన మంచి పరిపాలన అందించడంతో పాటు ప్రజల్ని కన్నబిడ్డల్లా చూసుకుంటూ ఉంటాడట. దీంతో సింహసనం మీద ఆశలు పెంచుకున్న భల్లాలదేవుడు ఆయన తండ్రి బాహుబలి అడ్డు తొలగించుకోవాలనుకుంటారట..దీనికి సుబ్బరాజు కట్టప్పతోనే బాహుబలిని చంపేలా పథక రచన చేశాడట అంటూ ఫిలింనగర్‌లో చర్చించుకుంటున్నారు..మరి బాహుబలి చావు వెనుక కుట్ర ఎంటో తెలియాలంటే ఏప్రిల్ 28 వరకు వెయిట్ చేయాల్సిందే.