English | Telugu

రాజమౌళితో పోటీనా..ఎంత ధైర్యం...!

ప్రపంచం మొత్తం ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న "బాహుబలి ద కన్‌క్లూజన్" విడుదలకు సమయం దగ్గరపడుతోంది. గతేడాది బాహుబలి మ్యానియా చూసిన దర్శకులు, బడా హీరోలు తమ సినిమాలను వాయిదా వేసుకుంటున్నారు. ఇది ఒక్క టాలీవుడ్‌కే పరిమితం కాలేదు మొత్తం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తం బాహుబలి అంటే భయపడుతోంది. కాని ఒక్కరు మాత్రం బాహుబలికి ఎదురు నిలిచేందుకు పోటీపడుతున్నాడు. ఆయన ఎవరో కాదు అవసరాల శ్రీనివాస్. కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, డైరెక్టర్‌గా ప్రతి ఒక్కరికి తన అవసరం ఉండేలా చేసుకున్న మల్టీ టాలెంటేడ్ అవసరాల శ్రీనివాస్.

అవసరాల హీరోగా బాలీవుడ్‌లో సూపర్‌హిట్ అయిన "హంటర్‌"కు రీమేక్‌గా నవీన్ మేడారం దర్శకత్వంలో "బాబు బాగా బిజీ" అనే మూవీ తెరకెక్కుతోంది. రీసెంట్‌గా రిలీజ్ చేసిన టీజర్‌కి మంచి రెస్పాన్స్ రావడంతో చిత్రయూనిట్ సంబరాల్లో మునిగిపోయింది. అయితే ఈ మూవీని ఏప్రిల్ 28న బాహుబలి-2కి పోటీగా రిలీజ్ చేయాలనుకుంటున్నారని ఫిల్మ్‌నగర్‌ టాక్. మొత్తం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీనే బాహుబలి ముందు నిలబడలేక భయపడుతుంటే "బాబు బాగా బిజీ" లాంటి చిన్న సినిమాను అదే రోజు రిలీజ్ చేయడం నిజంగానే పెద్ద రిస్క్. అయితే ఫుల్‌ అడాల్ట్ కంటెంట్‌తో టార్గెట్ ఆడియన్స్‌ని బేస్ చేసుకునే ఇంత ధైర్యం చేసేందుకు నిర్మాతలు రెడీ అయ్యారని సినీ జనాలు గుసగుసలాడుకుంటున్నారు.