English | Telugu

కీర‌వాణి లేక‌పోతే రాజ‌మౌళి లేడా??


ఓ ప‌క్క బాహుబ‌లి 2 ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్ కోసం ఆస‌క్తిగా చిత్ర‌సీమ అంతా ఎదురుచూస్తుంటే మ‌రోవైపు త‌న ట్వీట్ల‌తో ఆక‌ట్టుకొనే ప్ర‌య‌త్నం చేశారు సంగీత దిగ్గ‌జం కీర‌వాణి. త‌న కెరీర్‌లో ఎన్న‌డూ లేని రీతిలో వివాదాస్ప‌ద ట్వీట్ల‌తో హోరెత్తించారు. కొంత‌మంది బుర్ర లేని ద‌ర్శ‌కుల‌తో ప‌నిచేశాన‌ని, త‌న మాట చాలామంది ద‌ర్శ‌కులు విన‌లేద‌ని వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశాడు. త‌న రిటైర్‌మెంట్ గురించి చాలా మంది ఆశ‌గా ఎదురుచూశార‌ని త‌మ‌న్ లాంటి ద‌ర్శ‌కుల పేర్లు ప్ర‌స్తావించాడు. అయితే అన్ని ట్వీట్ల‌కంటే... ఓ ట్వీట్ అమితంగా ఆక‌ర్షించింది. నేను తోడుగా ఉన్నంత వ‌ర‌కూ రాజ‌మౌళిని ఎవ్వ‌రూకొట్ట‌లేరు.. అంటూ ట్వీటాడు పెద్ద‌న్న. అంటే రాజ‌మౌళి విజ‌యాల్లో త‌న వాటా ఎక్కువ‌నే క‌దా అర్థం. రాజ‌మౌళి త‌న మాట వింటాడు కాబ‌ట్టే.... త‌న సినిమాల్లో పాట‌లు అంత బాగుంటాయ‌ని చెప్పుకొచ్చాడు కీర‌వాణి.

ఈ ట్వీట్లే కాస్త టూమ‌చ్‌గా అనిపిస్తాయి. కీర‌వాణి లేక‌పోతే రాజ‌మౌళి లేడ‌న్న అర్థంలో సాగాయి కొన్ని ట్వీట్లు. రాజ‌మౌళి సినిమాల్లో కీర‌వాణి మంచి పాట‌లిచ్చిన మాట వాస్త‌వ‌మే. అయితే.. ఓ సంగీత ద‌ర్శ‌కుడి నుంచి త‌న‌కు కావ‌ల్సిన పాట‌లు తీసుకోవ‌డం కూడా ద‌ర్శ‌కుడి స‌మ‌ర్థ‌త‌పై ఆధార ప‌డి ఉంటుంది. త‌న మాట‌లు విన‌ని ద‌ర్శ‌కులు బుర్ర‌లేనివాళ్ల‌ని, త‌న మాట విన్నాడు కాబ‌ట్టే.. రాజ‌మౌళి స్థాయిలో ఉన్నాడ‌ని చెప్పుకొనే ప్ర‌య‌త్నం చేయ‌డం ప్ర‌స్తుతం టాలీవుడ్ లో హాట్ టాపిక్‌గా మారింది.