English | Telugu

బాహుబ‌లి 2... క్లైమాక్స్ సీక్రెట్ ఇదే!

బాహుబ‌లి 2 విష‌యంలో ఓ ఆస‌క్తిక‌ర‌మైన వార్త టాలీవుడ్ అంతా చ‌క్క‌ర్లు కొడుతోంది. ఈ సినిమా కోసం 4 క్లైమాక్స్‌లు షూట్ చేశార‌ని, అందులో ఒక‌టి ఫైన‌ల్ గా ఫిక్స్ చేయాల్సివుంద‌ని చెప్పుకొన్నారు. వీటిపై రాజ‌మౌళి క్లారిటీ ఇచ్చేశాడు. ఒక క్లైమాక్స్ తీసేట‌ప్ప‌టికే.. ఓపిక అయిపోయింద‌ని, నాలుగు క్లైమాక్స్‌లు తీసేంత సీన్ లేద‌ని న‌వ్వేశాడు రాజ‌మౌళి. అయితే... స‌వాల‌క్ష వెర్ష‌న్లు అనుకొన్న మాట వాస్త‌వ‌మే అని, అయితే.. షూటింగ్‌కి వెళ్లేముందు ఎలా తీయాలో, ఏం తీయాలో ముందే ఫిక్స‌యి వెళ్లామ‌ని, బాహుబ‌లి కోసం తీసింది ఒకే ఒక్క క్లైమాక్స్ అని రాజ‌మౌళి చెప్పేశాడు.

అయితే క్లైమాక్స్ కి సంబంధించి జక్కన్న ఓ సీక్రెట్ రివీల్ చేశాడు. ప్ర‌భాస్ - రానాల ఫైట్‌తో ఈ సినిమా ఎండ్ చేశాడ‌ట‌. ప్ర‌భాస్‌, రానాల‌ను తొలి స‌న్నివేశం నుంచే అత్యంత బ‌ల‌వంతులుగా చూపించామ‌ని, వాళ్లిద్ద‌రి మ‌ధ్య పోరు క్లైమాక్స్‌లో చూపించ‌డ‌మే మంచిద‌ని ఫిక్స‌య్యాన‌ని, అందుకే రానా, ప్ర‌భాస్‌ల ఫైట్ క్లైమాక్స్‌లో ప్లాన్ చేశాన‌ని ఆ సీక్రెట్ రివీల్ చేశాడు రాజ‌మౌళి. టీజ‌ర్ ఎండ్ చేసింది కూడా అక్క‌డే. టీజ‌ర్‌లో ప్ర‌భాస్ బాహుబ‌లి ఎదురెదురుగా వ‌చ్చిన షాట్ క‌నిపిస్తుంది క‌దా? బాహుబ‌లి క్లైమాక్స్ అదే.