English | Telugu

భాగమతి థ్రిల్లర్ కాదట..?

అరుంధతి, రుద్రమదేవి, సైజ్ జీరో వంటి చిత్రాలలో నటన ద్వారా లేడి ఓరియేంటేడ్ మూవీస్‌కి కేరాఫ్‌గా నిలిచారు అనుష్క. ఎస్ఎస్. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి బిగినింగ్‌లో డిగ్లామర్ పాత్రలో కనిపించినా.. బాహుబలి కన్‌క్లూజన్‌లో యువరాణిగా కళ్లతోనే రాజరికాన్ని పలికించి అందరి చూపు తనవైపు తిప్పుకుంది. ఆ సినిమా తర్వాత అనుష్క భాగమతి సినిమాలో నటిస్తోంది. ఫస్ట్‌లుక్‌తో పాటు టీజర్‌‌ను చూసిన వారికి ఎవరికైనా ఇదో హార్రర్ అని.. థ్రిల్లర్ అని.. పునర్జన్మల నేపథ్యంలో మరో అరుంధతిలా ఉంటుందని సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

కానీ ఇప్పుడు ఈ వెర్షనంతా మారిపోయింది... ఇదో పొలిటికల్ డ్రామా అంటున్నారు సినీజనాలు. ఈ మూవీలో అనుష్క పొలిటీషియన్‌గా.. ఒక సంస్థానానికి వారసురాలిగా రెండు పాత్రల్లో కనిపిస్తుందట.. 500 ఏళ్ల నాటి కధను.. ప్రస్తుతానికి ముడిపెడుతూ భాగమతి సాగుతుందట. కథలో కీలకభాగం ఓ కోటలో సాగుతుందట... ఈ కోటకీ.. కథకి ఓ లింక్‌ ఉంటుందట. మరి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందనేది తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే. ఈ మూవీకి పిల్ల జమీందార్ ఫేం అశోక్ దర్శకత్వం వహిస్తుండగా.. యూవీ క్రియేషన్స్‌ నిర్మిస్తోంది. రిపబ్లిక్ డే కానుకగా జనవరి 26న భాగమతి ప్రేక్షకుల ముందుకు రానుంది.