English | Telugu
పవన్ పోరికి ఛాన్స్ ఇచ్చిన టైగర్
Updated : Dec 5, 2015
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కథానాయకుడిగా నటిస్తోన్న సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా కోసం తొలుత అనీషా ఆంబ్రోస్ హీరోయిన్ గా ఎంపిక చేసుకున్న సంగతి తెలిసందే. ఆమె పై కొన్ని సన్నివేశాలు కూడా చిత్రీకరించిన తర్వాత క్యారెక్టర్ కు సరిపడలేదంటూ తప్పించారు. కన్నడలో ఒకట్రెండు అవకాశాలు రావడంతో బెంగళూరులోనే సెటిలైన అనీషాకు అనుకోకుండా ఇప్పుడు తెలుగులో ఓ ఛాన్స్ దక్కింది. యువ కథానాయకుడు సందీప్ కిషన్ సరసన ఓ క్రేజీ ప్రాజెక్టులో ఆమె చోటు దక్కించుకుంది. తమిళ హిట్ మూవీ 'నేరం' రీమేక్ లో అనీషానే కథానాయికగా నటించనుంది. ఈ సినిమాకు 123 అనే టైటిల్ అనుకుంటున్నారు. మిస్టర్ నూకయ్య ఫేమ్ అని కన్నెగంటి దర్శకత్వం వహిస్తాడు. అనిల్ సుంకర నిర్మాత.