English | Telugu

ఎన్టీఆర్... ఇది అయ్యే ప‌నేనా??

ఈ సంక్రాంతికి డిక్టేట‌ర్‌కి పోటీ ప‌డడానికి స‌మాయాత్తం అవుతోంది నాన్న‌కు ప్రేమ‌తో! దాంతో బాబాయ్ - అబ్బాయ్‌ల మ‌ధ్య ర‌స‌వ‌త్త‌ర‌మైన బాక్సాపీసు పోరు చూడ్డానికి సినీ అభిమానులు కూడా రెడీ అయిపోతున్నారు. అయితే నాన్న‌కు ప్రేమ‌తో సంక్రాంతికి విడుదల కావ‌డం అయ్యే ప‌నేనా అంటూ.. విశ్లేష‌కులు అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు. దానికీ కార‌ణం లేక‌పోలేదు.

ప్ర‌స్తుతం నాన్న‌కు ప్రేమ‌తో సినిమా స్పెయిన్‌లో షూటింగ్ జ‌రుపుకొంటోంది. అక్క‌డ దాదాపు ప‌దిహేను రోజుల షెడ్యూల్ ఉంది. తిరిగొచ్చాక హైద‌రాబాద్‌లో పాట‌ల్ని తెర‌కెక్కిస్తారు. అంటే మ‌రో మూడు వారాల పాటు షూటింగ్ జ‌రుగుతూనే ఉంటుంద‌న్న‌మాట‌. డిసెంబ‌రు చివ‌రి వారం వ‌ర‌కూ సినిమా తీస్తూనే ఉంటే ఇక ఎడిటింగ్ చేసేదెప్పుడు, ఆర్‌.ఆర్ ఇచ్చేదెప్పుడు, ప్ర‌మోష‌న్లు చేసేదెప్పుడు?? క‌నీసం ఆడియో కూడా రిలీజ్ కాలేదు. కేవ‌లం డిక్టేట‌ర్‌తో పోటీ ప‌డ‌డానికే ఈ సినిమాకి హ‌రీ బ‌రీగా పూర్తి చేస్తున్నార‌న్న‌ది వాస్త‌వం.

కానీ... అనుకొన్న స‌మ‌యానికి సినిమా పూర్తి చేయ‌డం సుకుమార్‌కి క‌త్తిమీద సామే. సుక్కు అస‌లే సినిమాని చెక్కుతూ ఉంటాడు. టార్గెట్ ఇచ్చి సినిమా పూర్తి చేయ‌మంటే., సుక్కులాంటివాళ్లు చేతులు ఎత్తేయ‌డం ఖాయం. అలాంట‌ప్పుడు ఈసినిమా సంక్రాంతికి రావ‌డం అనుమాన‌మే. నిజంగా ఎన్టీఆర్ సంక్రాంతికి రాక‌పోతే.. నంద‌మూరి బాల‌కృష్ణ‌కు సోలో రిలీజ్ అవుతుంది. బాబాయ్‌తో పోటీ ప‌డ‌లేక చేతులెత్తేశాడ‌న్న అప‌ఖ్యాతి ఎన్టీఆర్ ఎదుర్కోవాల్సివ‌స్తుంది. తార‌క్‌.. ఇదంతా నీకు అవ‌స‌ర‌మా??