English | Telugu

గోన‌గ‌న్నారెడ్డిని చూసి వారు బాధపడుతున్నారా?

రుద్ర‌మ‌దేవి సినిమాని నిల‌బెట్టిన విష‌యం ఏదైనా ఉందంటే.. అది గోన‌గ‌న్నారెడ్డి పాత్రే. ఈ పాత్ర ఒప్పుకొన్న‌ప్పుడు బ‌న్నీ ఏమైనా త‌ప్పు చేస్తున్నాడేమో అనుకొన్నారంతా. ఎందుకీ రిస్క్ అంటూ వారించారు కూడా. కానీ బ‌న్నీ విన‌లేదు. ఆప‌ద‌లో ఉన్న సినిమాని ఆదుకోవ‌డ‌మే ల‌క్ష్యంగా గోన‌గ‌న్నారెడ్డి పాత్ర‌ని ఫ్రీగా చేశాడు. ఇప్పుడు క్రెడిట్ అంతా సోలోగా కొట్టుకెళ్లిపోయాడు. అయితే ఈ పాత్ర కోసం ఎన్టీఆర్‌, మ‌హేష్‌బాబు, ర‌వితేజ‌ల‌ను సంప్ర‌దించాడు గుణ‌శేఖ‌ర్‌. ముందు మ‌హేష్‌ని అనుకొన్నా కాల్షీట్లు సర్దుబాటు చేయ‌లేక‌పోయాడు. ఎన్టీఆర్ కోస‌మైతే నెల రోజులు షూటింగ్ ఆపుకొన్నాడు గుణ‌శేఖ‌ర్‌. అప్ప‌టికీ ఎన్టీఆర్ ఏమీ తేల్చ‌క‌పోవ‌డంతో ర‌వితేజ ద‌గ్గ‌ర‌కు వెళ్లాడు. ర‌వితేజ‌కు అప్పటికే నిప్పు ఫ్లాప్ ఇర‌కాటంలో నెట్టేసింది. అందుకే ఆయనా లైట్ తీసుకొన్నాడు. గోన‌గ‌న్నారెడ్డి పాత్ర అల్లు అర్జున్ చేస్తే బాగుంటుంద‌న్న విష‌యం గుణ మైండ్‌కే రాలేదు. అలాంటిది అటు తిరిగి, ఇటు తిరిగి బ‌న్నీ చేతికి వెళ్లిపోయింది. ఇప్పుడు రుద్ర‌మ‌దేవి గురించి కంటే.. బ‌న్నీ గురించే ఎక్కువ‌గా మాట్లాడుకొంటున్నారు. దీంతో గోన‌గ‌న్నారెడ్డి చూసి వారు ఎంత బాధపడుతున్నారో.. పాపం!!!