English | Telugu

గుణ శేఖ‌ర్ ఫ్యూచ‌ర్‌.. చిరు చేతుల్లో

రుద్ర‌మ‌దేవి శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. ఈ మూడు రోజులూ వ‌సూళ్ల పండ‌గ చేసుకోవ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. అయితే... గుణ‌శేఖ‌ర్ తేరుకోవాలంటే మూడు రోజులు స‌రిపోదు. క‌నీసం వారం రోజులు ఇదే జోరు ఉండాలి. కానీ వ‌చ్చే వారం రామ్‌చ‌ర‌ణ్ బ్రూస్లీ వ‌చ్చేస్తుంది. ఆ సినిమా వ‌స్తే రుద్ర‌మదేవి దోబ్బడం ఖాయం. బ్రూస్లీకి పెద్ద రిలీజ్ ఉంది. బ్రూస్లీ కోసం రుద్ర‌మ‌దేవి థియేట‌ర్ల‌ను వ‌దులుకోవాల్సిందే.

బ్రూస్లీ ఓ వారం ఆల‌స్యంగా వ‌స్తే.. రుద్ర‌మ‌దేవికి ప్ల‌స్ అయ్యే అవ‌కాశం ఉంది. ద‌స‌రా సీజ‌న్‌, దానికి తోడు మ‌రో సినిమా ఉండ‌దు కాబ‌ట్టి... ఇక ఆ సినిమానే చూస్తారు. అప్పుడు గానీ రుద్ర‌మ దేవి కోసం గుణ పెట్టిన పెట్టుబ‌డి వెన‌క్కి రాదు. అందుకోస‌మే గుణ శేఖ‌ర్ చిరంజీవిపై ఒత్తిడి తీసుకొచ్చే ప్ర‌య‌త్నం చేస్తున్నాడ‌ని టాక్‌. ప‌రిశ్ర‌మ‌లోని కొంత‌మంది పెద్ద‌ల్ని క‌లిసి... `బ్రూస్లీ వాయిదా వేయించండి` అని అభ్య‌ర్థిస్తున్నాడ‌ట‌. ప‌రిశ్ర‌మ‌లోని బ‌డా నిర్మాత‌లు చిరంజీవిని సంప్ర‌దించి గుణ‌శేఖ‌ర్ త‌రుపున చిరుని అభ్య‌ర్థిస్తార‌ట‌.

ప‌రిశ్ర‌మ కోస‌మైనా చిరు ఓవారం రోజులు వాయిదా వేయించొచ్చ‌న్న‌ది గుణ‌శేఖ‌ర్ ఆలోచ‌న‌. అయితే... ద‌స‌రా సీజ‌న్‌ని వ‌దులుకోవ‌డానికి ఎవ్వ‌రికీ ఇష్టం ఉండ‌దు. దానికి తోడు అఖిల్ సినిమా కూడా పోటీ లో ఉంది. 16వ తేదీన బ్రూస్లీ రాక‌పోతే... 22న అఖిల్ వచ్చేస్తాడు. మ‌రో స్లాట్ దొర‌క‌లాంటే టైమ్ ప‌డుతుంది. అందుకే వీరంద‌రి కోరికా నెర‌వేరే అవ‌కాశాలు క‌నిపించ‌డం లేదు. గుణ ప్లాన్ కూడా వ‌ర్క‌వుట్ అయ్యే సూచ‌న‌లు క‌నిపించ‌డం లేదు. గుణశేఖ‌ర్ భ‌వితవ్యం ఇప్పుడు చిరు చేతుల్లో ఉందన్న‌ది కాద‌న‌లేని స‌త్యం. మ‌రి చిరు ఏం చేస్తాడో?