English | Telugu

మ‌క్క‌ల్ సెల్వ‌న్ పాత్ర‌లో స్టైలిష్ స్టార్?

రీమేక్ ల‌కు దూరంగా ఉండే టాలీవుడ్ టాప్ హీరోల్లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఒక‌రు. క‌థానాయ‌కుడిగా త‌న 18 ఏళ్ళ సుదీర్ఘ సినీ ప్రస్థానంలో ఒక్క రీమేక్ లో కూడా న‌టించ‌లేదు బ‌న్నీ. అలాంటి ఈ టాలెంటెడ్ స్టార్ త్వ‌ర‌లో ఓ రీమేక్ లో న‌టించ‌బోతున్నాడ‌ట‌. కాక‌పోతే, అతిథి త‌ర‌హా పాత్ర‌లో.

ఆ వివ‌రాల్లోకి వెళితే.. త‌మిళ‌నాట విజ‌యం సాధించిన `ఓ మై క‌డ‌వులే`(2020) చిత్రాన్ని తెలుగులో పున‌ర్నిర్మిస్తున్నారు. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ‌లు పీవీపీ సినిమా, శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్న ఈ చిత్రంలో విశ్వ‌క్ సేన్, మిథిలా పాల్క‌ర్ జంట‌గా క‌నిపించ‌బోతున్నార‌ని స‌మాచారం. కాగా, మాతృక‌లో మ‌క్క‌ల్ సెల్వ‌న్ విజ‌య్ సేతుప‌తి `క‌డ‌వుల్` (దేవుడు) పాత్ర‌లో ద‌ర్వ‌న‌మివ్వ‌గా.. తెలుగు వెర్ష‌న్ కిగానూ ఆ పాత్ర‌లో అల్లు అర్జున్ ని న‌టింప‌జేసే ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయ‌ని వినికిడి. మ‌రి.. రీమేక్ ల‌కు దూరంగా ఉండే బ‌న్నీ.. ఈ స్పెష‌ల్ రోల్ కి ఓకే చెపుతాడో లేదో తెలియాలంటే కొన్నాళ్ళు వేచిచూడాల్సిందే.

కాగా, ప్ర‌స్తుతం అల్లు అర్జున్ `పుష్ప‌`లో న‌టిస్తున్నాడు. రెండు భాగాలుగా తెర‌కెక్కుతున్న ఈ సినిమాని సుకుమార్ రూపొందిస్తున్నాడు. క్రిస్మ‌స్ కానుక‌గా ఫ‌స్ట్ పార్ట్ `పుష్ప ద రైజ్` థియేట‌ర్ల‌లోకి రానుంది.