English | Telugu

ఇవాళ చైతూ బర్త్‌ డే.. విష్ చేయని సమంత

పెళ్లయిన తర్వాత తన భర్త మొదటి పుట్టినరోజు లైఫ్‌లో గుర్తిండిపోయేలా సెలబ్రేట్ చేయాలనుకుంటుంది ప్రతీ భార్య. నాగచైతన్యతో లాంగ్ లవ్‌కి ఫుల్ స్టాప్ పెట్టి పెద్దల అంగీకారంతో.. గోవాలో చైతూని పెళ్లి చేసుకుని అక్కినేని వారింట్లో అడుగుపెట్టింది సమంత. మ్యారేజ్ తర్వాత ఇవాళ చైతూ ఫస్ట్ బర్త్‌డే జరుపుకుంటున్నాడు. దీంతో సన్నిహితులు, టాలీవుడ్ ప్రముఖుల నుంచి చైతన్యకి బర్త్ డే విషెస్ వెల్లువలా వస్తున్నాయి.

సరే ఈ సంగతి పక్కనబెడితే చైతూకి సామ్ ఏం గిఫ్ట్ ఇస్తుందా అని అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తూ.. ఆమె ట్విట్టర్‌ ఎకౌంట్‌ని చూస్తే అసలు విషయం తెలిసింది. సమంత అసలు నాగచైతన్యని విష్ చేయలేదట. కానీ సోషల్ మీడియాలో తన పెళ్లినాటి ఫోటోని పోస్ట్ చేస్తూ.. "హ్యాపీ బర్త్ డే మై ఎవ్రీథింగ్.. నేను విష్ చెయ్యను, ప్రతి రోజు నేను దేవుణ్ని ప్రార్థిస్తాను.. నువ్వు కోరుకున్న ప్రతిదీ నీకు దక్కేలా చేయమని. ఐ లవ్ యు ఫర్ ఎవర్.. హ్యాపీ బర్త్ డే చై" అంటూ విష్ చేయను అంటూనే విష్ చేసింది సమంత.