English | Telugu

హలో కోసం నాగ్ పడిన కష్టం వ్యర్థమేనా..?

తన కొడుకు అఖిల్‌ను హీరోగా నిలబెట్టడానికి నాగార్జున ఎంత కష్టపడుతున్నారో టాలీవుడ్‌తో పాటు ప్రేక్షకులు చూస్తూనే ఉన్నారు. తొలి చిత్రం అఖిల్ అట్టర్ ఫ్లాప్ కావడంతో.. స్టోరీ, స్క్రీన్‌ప్లే, డైరెక్టర్‌తో పాటు అక్కినేని అభిమానులకు ఏం కావాలో అన్ని ఒకే చోట కూర్చి తనే నిర్మాతగా మారి హలోని తెరకెక్కించాడు నాగ్. దానికి తోడు వైవిధ్యమైన చిత్రాల దర్శకుడిగా పేరున్న విక్రమ్ కుమార్ డైరెక్టర్ కావడంతో హలో‌పై రిలీజ్‌కు ముందే భారీ హైప్ వచ్చింది. తీరా రిలీజ్ అయ్యాకా పాజిటివ్ ‌టాక్‌తో పాటు.. కుర్రాడు బాగా చేశాడు అన్న పేరు వచ్చింది. అయితే బాక్సాఫీసు దగ్గర మాత్రం అఖిల్‌కు హలో చెప్పేవారు కరువయ్యారు.

నాని నటించిన ఎంసీఏ మిక్స్‌డ్ టాక్‌తో మాస్ ఆడియన్స్‌కి బాగా దగ్గరయి.. స్టడీగా వసూళ్లు రాబడుతోంది. ఇక రెండో వారానికి వచ్చే సరికి అల్లు శిరీష్ ఒక్కక్షణం, సునీల్ 2 కంట్రీస్, సందిప్ కిషన్ సినిమాలు హలోకి పోటీగా మారాయి. వీటిలో ఏ ఒక్కటి క్లిక్ అయినా హలోని జనం పక్కనబెట్టడం ఖాయమంటున్నారు విశ్లేషకులు.. తెలుగు రాష్ట్రాల్లో 32 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన హలో ఇప్పటి వరకు రూ.10.13 కోట్ల షేర్ మాత్రమే రాబట్టింది. దీంతో హలోకి హిట్ టాక్ తెచ్చుకున్నా.. కమర్షియల్‌గా ప్లాప్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు సినీ జనాలు.