English | Telugu

అఖిల్ శ్రీ‌యా బ్రేక‌ప్‌.. కార‌ణం ఇదేనా??

అఖిల్ - శ్రియా రెడ్డి నిశ్చితార్థం క్యాన్సిల్ అయిన వార్త టాలీవుడ్‌లో సంచ‌ల‌నంగా మారింది. నెల రోజుల క్రిత‌మే... గ్రాండ్‌గా నిశ్చితార్థం చేసుకొన్న ఈ ల‌వ్ జంట‌కు అంత ట్ర‌బుల్ ఏమొచ్చిందంటూ... ఆరాలు తీసేస్తున్నారంతా. విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం.. అఖిల్ - శ్రియా భూపాల్‌ల ఎంగేజ్‌మెంట్ క్యాన్సిల్ అవ్వ‌డానికి బ‌ల‌మైన కార‌ణం తెలిసింది. నిజానికి ఈ పెళ్లి శ్రియా ఇంట్లో అస్స‌లు ఏమాత్రం ఇష్టం లేద‌ట‌. వాళ్లు ముందు నుంచీ... ఈ సంబంధం వ‌ద్దూ.. వ‌ద్దూ అంటున్న‌ట్టు తెలుస్తోంది. సినిమా వాళ్ల ఫ్యామిలీకి త‌మ కుటుంబంలోని అమ్మాయిని ఇవ్వ‌డానికి జీవీకే కుటుంబానికి ఏమాత్రం ఇష్టంలేద‌ని తెలుస్తోంది. దానికి తోడు అఖిల్ కెరీర్‌లో ఇంకా సెటిల్ అవ్వ‌లేదు. తొలి సినిమా కూడా ఫ్లాప్ అయ్యింది.

ఈ కార‌ణాల‌తోనే.. ఈ పెళ్లికి జీవీకే ఫ్యామిలీ అడ్డు చెబుతూ వ‌చ్చింద‌ట‌. నిశ్చితార్థం జ‌ర‌ప‌డం కూడా జీవీకే కుటుంబ స‌భ్యుల‌కు ఏమాత్రం ఇష్టం లేద‌ని, కేవ‌లం శ్రియా భూపాల్ బ‌ల‌వంతంమీదే ఓకే చేశార‌ని తెలుస్తోంది. ఇటీవ‌ల‌... నాగ్ కుటుంబ స‌భ్యుల‌కూ, జీవీకే ఫ్యామిలీకీ మ‌ధ్య ఓ గెట్ టుగెద‌ర్ జ‌రిగింద‌ట‌. అప్పుడు.. రెండు కుటుంబాల మ‌ధ్య లుక‌లుక‌లు తీవ్ర‌స్థాయిలో బ‌య‌ట‌కు వ‌చ్చాయ‌ని చెబుతున్నారు. ఆ రోజే నిశ్చితార్థం క్యాన్సిల్ చేసుకోవాల‌న్న నిర్ణ‌యానికి వ‌చ్చేశార‌ని, మెల్ల‌మెల్ల‌గా ఆ విష‌యం మీడియా వ‌ర‌కూ చేరింద‌ని తెలుస్తోంది.