English | Telugu
SSMB 28లో ఐశ్వర్య రాయ్!
Updated : Jan 30, 2023
సూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్ మూవీ SSMB 28. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో హారిక అండ్ హాసిని క్రియేషన్స్ భారీ ఎత్తున నిర్మిస్తున్న ఈ సినిమాలో మహేష్ బాబు సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. కాగా ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో ఐశ్వర్య రాయ్ నటించబోతుందని ఫిల్మ్‌నగర్ సమాచారం. త్రివిక్రమ్ తన సినిమాల్లోని కీలకమైన పాత్రలను సీనియర్ హీరోయిన్స్ తో చేయిస్తుంటారు. అలా ఆయన నదియా, ఖుష్బూ, స్నేహ, టబు వంటివారిని రంగంలోకి దింపారు. ఇప్పుడు ఐశ్వర్య రాయ్ పేరు వినిపిస్తోంది.
కాగా ఈ చిత్రంలోని మహేష్, ఐశ్వర్యరాయ్ మధ్య వచ్చే సన్నివేశాలు చాలా ఇంట్రస్టింగ్‌గా వుంటాయట. ఇక ఈ వార్త తెలుసుకున్న మహేష్ ఫ్యాన్స్ అనందాల సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా ఒకేసారి రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. గతంలో మహేష్, త్రివిక్రమ్ కాంబోలో అతడు, ఖలేజా సినిమాలు రాగా.. అతడు మూవీ హిట్‌గా అవ్వగా.. ఖలేజా మూవీ డిజాస్టర్‌గా నిలిచింది. మూడో సినిమాతో కచ్చితంగా హిట్ కొట్టాలని అందరూ కోరుకుంటున్నారు.
మహేష్ త్రివిక్రమ్ కలయికలో వస్తున్న మూడో సినిమాలో ఐశ్వర్య రాయ్ నటిస్తుందనే వార్త తెలియడంతో అభిమానులకు ఈ చిత్రంపై అంచనాలు పెరిగిపోతున్నాయి. ఈ సినిమాకు మ్యూజిక్ సెన్సేషన్ తమన్ సంగీతం అందించనున్నారు. అలాగే ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా పెళ్ళిసందడి, ధమాకా బ్యూటీ శ్రీలీల నటిస్తుందని టాక్. ఏదేమైనా సినిమాపై అంచనాలు మాత్రం రోజురోజుకీ పెరుగుతూనే వస్తున్నాయి.