English | Telugu

ఆ రెండు సినిమాలు కూడా కాపీయేనట..?

త్రివిక్రమ్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన అజ్ఞాతవాసి టీజర్ చూసినవారు ఇది మరో అత్తారింటికి దారేది అన్నారు. అయినా సినిమాలో ఏదో కొత్తగా ఉందని ఫీలవ్వడంతో అంచనాలు ఆకాశాన్ని తాకాయి. సరిగ్గా ఇలాంటి టైంలో ఫ్రెంచ్ సినిమా లార్గోవించ్‌ను కాపీ కొట్టి త్రివిక్రమ్ అజ్ఞాతవాసిని తీశారని.. సదరు ఫ్రెంచ్ సినిమా రైట్స్ సొంతం చేసుకున్న టీ.సిరీస్‌ అజ్ఞాతవాసి నిర్మాతలకు లీగల్ నోటీసులు పంపించిందంటూ పెద్ద దుమారం రేగింది. అయితే కేవలం అజ్ఞాతవాసి ఒక్క దానికే కాకుండా మరో రెండు సినిమాలకు టీ.సిరీస్‌ నోటీసులు పంపిదంటూ ఫిలింనగర్‌లో ఓ వార్త చర్కర్లు కొడుతోంది.

తమ దగ్గర ఉన్న కథల్ని వేరే హీరోల సినిమాల కోసం కాపీ కొడుతున్నారని.. టీసిరీస్‌కు తెలియడంతోనే ఆ సంస్థ నోటీసులు పంపిందని టాలీవుడ్ టాక్. ఆ రెండు సినిమాల్లోనూ స్టార్ హీరోలే నటిస్తున్నారని.. అవి రెండు సమ్మర్‌లో రిలీజ్ అవబోతున్నాయని ఫిలింనగర్‌లో చర్చించుకుంటున్నారు. మరి ఆ ఇద్దరు స్టార్ హీరోలు ఈ విషయం బయటకు రాకుండా టీ.సిరీస్‌తో సెటిల్ చేసుకుంటారా..? ఇంతకీ ఆ ఇద్దరు స్టార్ హీరోలు ఎవరు..? ఆ రెండు సినిమాలు ఏంటో తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే అంటున్నారు విశ్లేషకులు.