English | Telugu

ఆ హీరోయిన్‌ని బెడ్ రూమ్‌కి ర‌మ్మ‌న్న‌ది ఎవ‌రు?

క‌స్తూరి తెలుసుక‌దా?? తెలుగు నైన్‌టీస్‌లో వ‌చ్చిన తెలుగు సినిమాల్లో త‌ర‌చూ క‌నిపించిన క‌థానాయిక‌. గ్లామ‌ర్ కంటే హోమ్లీ పాత్ర‌ల‌కే పెద్ద‌పీట వేసింది. ఇప్పుడు క‌న్న‌డ‌లో కొన్ని సినిమాలు చేస్తోంది. ఇటీవ‌ల ఇచ్చిన ఓ ఇంట‌ర్వ్యూలో క‌స్తూరి ఓ తెలుగు హీరోని టార్గెట్ చేస్తూ కొన్ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది.

సదరు హీరోతో తాను గ‌తంలో ఓ సినిమా చేశాన‌ని, అతను తన‌ని వాడుకోవాల‌ని చూశాడ‌ని, బెడ్ రూమ్‌కి ర‌మ్మ‌ని సంకేతాలు పంపాడ‌ని, కానీ.. తాను ప‌ట్టించుకోలేద‌ని, ఆ అస‌హ‌నాన్ని త‌ను చాలా సార్లు ప్ర‌ద‌ర్శించాడ‌ని, సెట్లో కోప్ప‌డేవాడ‌ని... ఇలా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. ఆ హీరో ఆ త‌ర‌వాత రాజ‌కీయాల్లోకి వ‌చ్చాడ‌ని, ఆ రోజు తాను కోప‌రేట్ చేయ‌నందువ‌ల్లే.. త‌దుప‌రి సినిమాల్లో న‌టించే ఛాన్స్ లేకుండా చేశాడ‌ని చెప్పుకొచ్చింది. దాంతో ఆ హీరో ఎవ‌రంటూ... టాలీవుడ్‌లో ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ న‌డుస్తోంది. క‌స్తూరితో ఒకే ఒక్క సినిమా చేసి, ఆ త‌ర‌వాత రాజ‌కీయాల్లోకి షిప్ట్ అయిపోయిన హీరోల లిస్టు తీస్తున్నారు సినీ అభిమానులు. మ‌రి క‌స్తూరిని ఏడిపించిన ఆ హీరో ఎవ‌రో మీకేమైనా తెలిసిందా??