English | Telugu
ఎన్టీఆర్-కొరటాల మూవీలో విజయశాంతి!!
Updated : Jun 4, 2021
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'ఆర్ఆర్ఆర్'లో నటిస్తున్నాడు. ఈ ప్రాజెక్ట్ తరువాత కొరటాల శివ డైరెక్షన్ లో ఒక మూవీ చేయనున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ మూవీకి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ చక్కర్లు కొడుతోంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో లేడీ అమితాబ్ విజయశాంతి నటించనుందని టాక్ వినిపిస్తోంది.
గతంలో ఎన్టీఆర్-కొరటాల శివ కాంబినేషన్ లో వచ్చిన 'జనతా గ్యారేజ్' ఘన విజయం సాధించింది. ఇందులో హీరోకి సమానమైన ఒక పవర్ ఫుల్ పాత్రలో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించారు. ఇప్పుడు ఎన్టీఆర్ తో చేస్తున్న రెండో సినిమాలో కూడా ఒక పవర్ ఫుల్ పాత్రను డిజైన్ చేశారట కొరత శివ. ఈ పాత్ర కోసం విజయశాంతిని సంప్రదించనున్నారని తెలుస్తోంది.
ప్రస్తుతం పాలిటిక్స్ లో బిజీగా ఉన్న విజయశాంతి చాలా కాలం సినిమాలకు దూరంగా ఉన్నారు. గతేడాది 'సరిలేరు నీకెవ్వరూ' సినిమాతో రీఎంట్రీ ఇచ్చినప్పటికీ.. ఆమె సెకండ్ ఇన్నింగ్స్ పై ఇంట్రెస్ట్ చూపలేదు. 'సరిలేరు నీకెవ్వరూ' తరువాత ఎన్నో మూవీ ఆఫర్స్ వచ్చినా ఆమె సున్నితంగా తిరస్కరించారు. మరి ఎన్టీఆర్- కొరటాల ప్రాజెక్ట్ లో నటించడానికి ఆమె ఓకే అంటారో లేదో చూడాలి.