English | Telugu
నాగబాబుపై పవన్‌కి కోపం ఎందుకు?
Updated : Sep 16, 2015
మెగా బ్రదర్ నాగబాబుని పవన్ కల్యాణ్ ఎన్నోసార్లు ఆదుకొన్నాడు. అన్నయ్య చిరంజీవితో విబేధాలొచ్చినా... నాగబాబుతో మాత్రం సన్నిహితంగానే మెలిగాడు పవన్. ఆరెంజ్ సినిమా ఫ్లాపయినప్పుడు, ఆర్థికంగా నాగబాబు అప్పుల్లో కూరుకుపోయినప్పుడు ఆదుకొన్నాడు. అలాంటి నాగబాబుపై కూడా పవన్ కి కోపం వచ్చిందట. అందుకే వరుణ్ తేజ్ నటిస్తున్న కంచె ఆడియో ఫంక్షన్ కి కావాలనే పవన్ డుమ్మా కొడుతున్నాడని టాక్.
కంచె ఆడియో ఫంక్షన్ హైదరాబాద్‌లోని ఫలక్‌నామా ప్యాలస్ లో జరగబోతోంది. ఈ కార్యక్రమానికి పవన్‌ని ఆహ్వానించినా.. నో చెప్పాడట. దానికి కారణం నాగబాబు అని తెలిసింది. ఇటీవల ఓ కార్యక్రమంలో నాగబాబు... పవన్‌పై ఘాటుగా స్పందించాడు. చిరంజీవి బర్త్‌డే వేడుకలకుహాజరవ్వకపోవడం పై తన కోపాన్ని అభిమానుల సమక్షంలో, మీడియా సాక్షిగా వెళ్లకక్కాడు.
విపత్కర పరిస్థితుల్లో సాయం చేసినా, ఆ మాట మర్చిపోయి తనపై అభిమానుల ముందే ఫైర్ అవ్వడం పవన్‌కి ఏమాత్రం నచ్చలేదట. అందుకే కంచె ఆడియో ఫంక్షన్‌కి డుమ్మా కొడుతున్నాడని టాలీవుడ్ సమాచారం. ఇప్పటికే చిరుకు దూరమైన పవన్... ఈ ఉదంతంతో నాగబాబుకీ దూరమైనట్టే అని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.