English | Telugu

ఎన్టీఆర్ తో హిట్ కొడతాడా?

టాలీవుడ్ అగ్రహీరోల డేట్స్ కోసం నిర్మాత‌లూ పోటీపడుతున్న విషయం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఎన్టీఆర్ డేట్లు ప్ర‌ముఖ నిర్మాత కె.ఎస్‌.రామారావు ప‌ట్టేశార‌ని టాక్‌. గతంలో ఈయన యంగ్ టైగర్ తో దమ్ము సినిమా తీశారు. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద యావరేజ్ గ్రాసర్ గా నిలిచింది. దీంతో ఆ నిర్మాతకు ఎన్టీఆర్ మరో ఛాన్స్ ఇచ్చినట్టు సమాచారం. ఇప్పుడు సురేంద‌ర్‌రెడ్డితోనే ఎన్టీఆర్‌కి క‌థ వినిపించే ప‌నిలో ప‌డ్డారట ఈ నిర్మాత‌. సురేంద‌ర్‌రెడ్డి , ఎన్టీఆర్ అన‌గానే అశోక్‌, ఊస‌ర‌వెల్లి సినిమాలు గుర్తొస్తాయి. ఆ రెండూ ఎన్టీఆర్ అభిమానుల్ని తీవ్రంగా నిరాశ‌ప‌రిచాయి. ముచ్చ‌ట‌గా మూడో ప్ర‌య‌త్నంలో అయినా ఎన్టీఆర్‌కి హిట్టిచ్చి బాకీ తీర్చుకుంటాడో లేదో మరీ.