English | Telugu

రాజ‌మౌళి Vs కోన వెంక‌ట్‌

రాజ‌మౌళి అన్న‌య్య, ర‌చ‌యిత‌, న‌టుడు ఎస్‌.ఎస్‌.కాంచి ఇప్పుడు ద‌ర్శ‌కుడిగా మారారు. ఆయ‌న రూపొందించిన షో టైమ్ టీజ‌ర్ ఈమ‌ధ్యే విడుద‌లైంది. థియేట‌ర్లో జ‌నాల బిహేవియ‌ర్‌ని బేస్ చేసుకొని, టైటిల్‌కి త‌గ్గ‌ట్టుగానే టీజ‌ర్‌ని వ‌దిలారు. ఆ టీజ‌ర్ అంద‌రినీ ఆక‌ట్టుకొంది. ఈసినిమాపై ఆస‌క్తిని పెంచింది. అయితే.. త‌మ‌న్నా - ప్ర‌భుదేవాల సినిమా అభినేత్రికీ.. షో టైమ్ క‌థ‌కూ పోలిక‌లున్న‌ట్టు స‌మాచారం. అభినేత్రి స‌మ‌ర్ప‌కుడు, ప్ర‌ముఖ ర‌చ‌యిత కోన వెంక‌ట్ చేసిన ట్వీట్‌తో.. విష‌యం బట్ట‌బ‌య‌లైంది.

రాజ‌మౌళి షో టైమ్ పోస్ట‌ర్‌ని ట్వీట్ చేస్తే.. దాన్ని రీ ట్వీట్ చేసి అభినేత్రి పోస్ట‌ర్‌ని పెట్టాడు కోన‌. ఈ పోస్ట‌ర్లు చూస్తే రెండు సినిమాల క‌థ దాదాపుగా ఒక్క‌టే అనే విష‌యం అర్థ‌మ‌వుతోంది. అంటే అభినేత్రిని షో టైమ్ వాళ్లు కాపీ కొట్టారా? షో టైమ్ చూసే అభినేత్రి వాళ్లు క‌థ అల్లుకొన్నారా? లేదంటే వీళ్లిద్దరూ క‌ల‌సి ఏ హాలీవుడ్ సినిమానో, కొరియ‌న్ సినిమానో కాపీ కొట్టేశారా? మొత్తానికి ఈ రెండు పోస్ట‌ర్లూ ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ అయిపోయాయి. ఎవ‌రు ఎవ‌రిని కాపీ కొట్టారో తెలియాలంటే ఈ రెండు సినిమాలూ విడుద‌ల కావాల్సిందే.