English | Telugu

ప్రభాస్ పాలిట రావణుడే ఎన్టీఆర్‌కు విలన్?!

రాజమౌళి చిత్రాల్లో నటిస్తే ఆ తర్వాత భారీ ఫ్లాప్స్ త‌ప్ప‌వ‌ని   గతంలో ఎన్నో చిత్రాలతో నిరూపితమైంది. ఈ లిస్టు తీసుకుంటే చాలా పెద్దదే అవుతుంది. ఎన్టీఆర్‌కు స్టూడెంట్ నెంబర్ 1 వంటి సూపర్ హిట్ అందించిన త‌ర్వాత  సుబ్బు చిత్రం రూపంలో డిజాస్టర్ వచ్చింది. ఇక మరోసారి ఎన్టీఆర్ తో సింహాద్రి తీస్తే ఆ తర్వాత నా అల్లుడు, నరసింహుడు, అశోక్ వంటి చిత్రాలు వచ్చాయి, యమదొంగ తర్వాత కంత్రీ తానున్నానంటూ  వచ్చేసింది.

సునీల్ మర్యాద రామన్న కూడా క‌ధ‌, స్క్రీన్ ప్లే,   దర్శకత్వం అప్పల్రాజు రూపంలో డిజాస్ట‌ర్  ఎదురయింది. నానికి ఈగ తర్వాత ఎటో వెళ్లిపోయింది మనసు,పైసా, ఆహా కళ్యాణం, జండా పై కపిరాజు వంటి భారీ డిజాస్టర్ కి వచ్చాయి. ఇక రవితేజకు విక్రమార్కుడు తర్వాత ఖతర్నాక్,నితిన్ కు సై తర్వాత అల్లరి బుల్లోడు, ధైర్యం, రామ్, టక్కరి ఇలాంటి చిత్రాలు వచ్చాయి. ప్రభాసుకు చత్రపతి తర్వాత పౌర్ణమి, యోగి,  బుజ్జిగాడు, బిల్లా, ఏక్ నిరంజన్లు వచ్చాయి. ఇక బాహుబలి తర్వాత సాహో, రాధేశ్యామ్ల‌ సంగతి తెలిసిందే. రామ్ చరణ్ కు మగధీర తర్వాత ఆరంజ్... ఆర్ ఆర్ ఆర్ తర్వాత ఆచార్య రూపంలో భారీ ఎదురు దెబ్బలే తగిలాయి.

సో ఆర్ ఆర్ ఆర్ లో  నటించిన రామ్ చరణ్ కు రాజమౌళి తర్వాతి చిత్రం గండం  ఆయన ఆచార్యతో నిరూపితమైంది. దాంతో చరణ్ ప్రస్తుతం ఎంతో రిలాక్స్‌గా  శంకర్ సినిమా చేస్తున్నారు.  ఇక తర్వాతి గండం యంగ్ టైగర్ ఎన్టీఆర్ కే అంటున్నారు. అందులోనూ ఎన్టీఆర్ చేయబోయే తదుపరి చిత్రం ఆయన 30 చిత్రం. ఈ చిత్రాన్ని ఆయన కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్నారు. చిరు, రామ్ చరణ్ కు జాయింట్ అకౌంట్ ద్వారా ఆచార్యతో ఫ్లాప్ ఇచ్చిన కొరటాల మరి ఎన్టీఆర్‌కు ఏం చేయబోతున్నాడా? అని అన్నిచోట్ల ఆసక్తి నెలకొని ఉంది. ఇక యంగ్ ఎన్టీఆర్ తో చేయబోతున్న కొరటాల సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 30వ సినిమా కాబట్టి అందునా ఆర్ ఆర్ ఆర్ తో విప‌రీత‌మైన క్రేజ్ రావ‌డంతో దీనిని కూడా  పాన్ ఇండియాలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అందుకు తగ్గట్టుగా కాస్టింగ్ కూడా ఉండేటట్టు చూసుకుంటున్నారు. 

ఈ సినిమాలో హీరోయిన్‌గా ఇప్పటికే శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ ని ఫిక్స్ చేసినట్లు సమాచారం. శ్రీదేవి గారాలపట్టి తెలుగులో చేస్తున్న మొదటి సినిమాగా ఈ ప్రాజెక్టుపై సూపర్ హైప్ వచ్చేసింది. ఇక విలన్ గా ముందు సంజయ్ దత్‌ను  అనుకున్నప్పటికీ ప్రస్తుతం సైఫ్ అలీ ఖాన్ ను  ఫైనల్ చేశారట. ఆది పురుష్‌లో  రాముడిగా ప్ర‌భాస్ న‌టిస్తుంటే  సైఫ్ అలీ ఖాన్  రావణుడి పాత్రను పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఇక కొర‌టాల  శివ రాసుకున్న విలన్ పాత్రకు సైఫ్ అయితేనే పర్ఫెక్ట్ అని భావిస్తున్నారట. అందుకే అతని ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. సైఫ్ కూడా తెలుగు సినిమాలలో, సౌత్ చిత్రాలలో నటించేందుకు ఆసక్తి చూపుతున్నారు.  

ఎన్టీఆర్‌కు ఈక్వల్ గా విలన్ పాత్ర కూడా చాలా పవర్ ఫుల్ గా ఉంటుందని తెలుస్తోంది. జనతా గ్యారేజ్‌తో హిట్టు కొట్టిన ఎన్టీఆర్- కొర‌టాల  శివ కాంబో ఈసారి పాన్ ఇండియా రేంజిలో సత్తా చాటాలని చూస్తున్నారు. ఆచార్య చిత్రం డిజాస్ట‌ర్ త‌ర్వాత   శివకు ఎన్నో అవమానాలను ఇచ్చింది. దాంతో ఎన్టీఆర్  సినిమాతో మరల తన సత్తా ఏమిటో, తన స్టామినా ఏమిటో ప్రూవ్ చేయాలని కొర‌టాల  శివ పట్టుదలగా ఉన్నారు.  రేపు రాబోయే సంక్రాంతికి ముహూర్తం పెట్టుకున్నారని తెలుస్తోంది. మొత్తానికి ఆర్ ఆర్ ఆర్ త‌ర్వాత  కాస్త గ్యాప్ తీసుకున్నప్పటికీ ఎన్టీఆర్ తన తదుపరిచిత్రం కి తగినంత అవుట్ పుట్ ఇచ్చేలా ప్లాన్ చేసుకుంటున్నారు. ఆర్ఆర్ఆర్ లాగానే ఈ  చిత్రంతో  నేషనల్ ఇంటర్నేషనల్ వైడ్ గా ఆడియన్స్ను మెప్పించాల‌నే ప‌ట్టుద‌ల‌తో ఉన్నారు.  ఈసారి కొరటాల శివ సినిమాతో నెక్స్ట్ లెవెల్ కి వెళ్లాలని ఆయన ఎదురు చూస్తున్నారు. వచ్చే ఏడాది చివరికల్లా తారక్ 30వ సినిమా రిలీజ్ చేయాలని ప్లాన్. మరి ఇది ఏ మాత్రం వర్కౌట్ అవుతుందో వెయిట్ చేయాలి...!