English | Telugu
ఆగస్టు నుంచి చరణ్ - శంకర్ చిత్రం?
Updated : Jun 17, 2021
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, ఏస్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో ఓ పాన్ - ఇండియా మూవీ రాబోతున్న సంగతి తెలిసిందే. స్టార్ ప్రొడ్యూసర్ `దిల్` రాజు ఈ భారీ బడ్జెట్ మూవీని నిర్మించనున్నారు.
ఇదిలా ఉంటే.. ఈ సినిమాకి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ ని ఆగస్టు నుంచి ప్రారంభించడానికి శంకర్ సన్నాహాలు చేస్తున్నారట. చరణ్ కూడా ఆగస్టులోనే షూట్ లో జాయిన్ కాబోతున్నారని సమాచారం. అంతేకాదు.. 2022 ద్వితీయార్ధంలో ఈ సినిమాని విడుదల చేయబోతున్నారట. కాగా, ఈ చిత్రానికి యువ సంగీత సంచలనం తమన్ బాణీలు అందించబోతున్నారని టాక్. అలాగే `మాస్టర్` ఫేమ్ మాళవికా మోహనన్ ఇందులో హీరోయిన్ గా నటించనుందని ప్రచారం సాగుతోంది. త్వరలోనే చరణ్ - శంకర్ కాంబినేషన్ మూవీకి సంబంధించి పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి.
కాగా, చరణ్ చేతిలో ప్రస్తుతం `ఆచార్య`, `ఆర్ ఆర్ ఆర్` చిత్రాలున్నాయి. ఈ రెండు సినిమాలు కూడా చిత్రీకరణ తుది దశలో ఉన్నాయి. `ఆచార్య`ని కొరటాల శివ డైరెక్ట్ చేస్తుండగా.. `ఆర్ ఆర్ ఆర్`ని రాజమౌళి రూపొందిస్తున్నారు.