English | Telugu

తారక్ షోకి గెస్ట్ గా చరణ్!!

'బిగ్ బాస్' షోతో బుల్లితెరపై సందడి చేసిన యంగ్ టైగర్ ఎన్టీఆర్.. 'ఎవరు మీలో కోటీశ్వరులు' షోతో మరోసారి బుల్లితెరపై సందడి చేయడానికి సిద్ధమైన సంగతి తెలిసిందే. త్వరలో ఈ షో జెమిని టీవీలో టెలీకాస్ట్ కానుంది. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ షో ఫస్ట్ ఎపిసోడ్‌ కు గెస్ట్ గా మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్‌ వస్తున్నట్లు తెలుస్తోంది.

తారక్, చరణ్ కలిసి రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఆర్ఆర్ఆర్'లో నటిస్తోన్న సంగతి తెలిసిందే. వెండితెరపై ఈ స్టార్స్ చేసే సందడి కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే అంతకన్నా ముందు వీరిద్దరూ కలిసి బుల్లితెరపై సందడి చేయనున్నారని టాక్ వినిపిస్తోంది. తారక్, చరణ్ మంచి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇద్దరు కలిసి సినిమా కూడా చేస్తున్నారు. అందుకే తారక్ షోకి ఫస్ట్ గెస్ట్ గా చరణ్ వస్తే బాగుంటుందని.. షోకి మరింత హైప్ వస్తుందని షో నిర్వాహకులు భావిస్తున్నట్లు సమాచారం.

ఇక 'ఆర్ఆర్ఆర్' విషయానికొస్తే ఇప్పటికే దాదాపు షూటింగ్ పూర్తయింది. ఈ ఏడాది అక్టోబర్ 13న విడుదల కానుంది. రోర్ ఆఫ్ ఆర్ఆర్ఆర్ పేరుతో తాజాగా విడుదల చేసిన మేకింగ్ వీడియో మూవీపై అంచనాలను మరింత పెంచింది.