English | Telugu
చరణ్ కి తండ్రిగా జగ్గూ భాయ్?
Updated : Jul 15, 2021
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కెరీర్ లోనే హయ్యస్ట్ గ్రాసర్ గా నిలిచిన చిత్రం `రంగస్థలం`(2018). బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ రూపొందించిన ఈ పిరియడ్ డ్రామాలో ప్రతినాయకుడి పాత్రలో అలరించారు వెర్సటైల్ యాక్టర్ జగపతిబాబు. మరీముఖ్యంగా.. ఈ సినిమాలో చరణ్, జగ్గూ భాయ్ మధ్య సాగే సన్నివేశాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. కట్ చేస్తే.. స్పల్ప విరామం అనంతరం ఈ ఇద్దరు మరోమారు కలిసి నటించబోతున్నారట. అయితే, ఈ సారి రామ్ చరణ్ కి విలన్ గా కాకుండా తండ్రి పాత్రలో జగపతిబాబు కనిపించనున్నట్లు టాక్.
ఆ వివరాల్లోకి వెళితే.. సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో చరణ్ ఓ పాన్ - ఇండియా మూవీ చేయబోతున్న సంగతి తెలిసిందే. స్టార్ ప్రొడ్యూసర్ `దిల్` రాజు నిర్మించనున్న ఈ భారీ బడ్జెట్ మూవీకి ప్రముఖ రచయిత సాయిమాధవ్ బుర్రా సంభాషణలు అందించనున్నారు. కాగా, రాజకీయ నేపథ్యంలో సాగే ఈ సినిమా కోసమే జగ్గూ భాయ్.. చరణ్ కి నాన్న వేషంలో దర్శనమివ్వనున్నారట. అంతేకాదు.. ఇదో శక్తిమంతమైన పాత్రని వినికిడి. మరి.. ఈ ప్రచారంలో నిజమెంతో తెలియాలంటే కొన్నాళ్ళు వేచిచూడాల్సిందే.
ఇదిలా ఉంటే.. ప్రస్తుతం చరణ్ చేతిలో `ఆచార్య`, `ఆర్ ఆర్ ఆర్` వంటి మల్టీస్టారర్స్ ఉన్నాయి. ఈ ఏడాదిలోనే ఈ క్రేజీ ప్రాజెక్ట్స్ థియేటర్స్ లోకి రానున్నాయి. అవి పూర్తయ్యాకే శంకర్ డైరెక్టోయల్ వెంచర్ ని పట్టాలెక్కించనున్నారు చెర్రీ.