English | Telugu

ఆమెకి ఫుల్ క్లారిటీ వచ్చేసింది

టాలీవుడ్ లో వరసగా భారీ అవకాశాలు చేజిక్కించుకుంటున్న రకుల్‌ ఇప్పటికే రవితేజతో కిక్‌`2 చేస్తోంది. ఇది కాకుండా చరణ్‌`శ్రీనువైట్ల సినిమా, సుకుమార్‌ దర్శకత్వంలో ఎన్టీఆర్‌తో తెరకెక్కనున్న సినిమాలలో చేయనుంది. చరణ్‌, ఎన్టీఆర్‌తోనే కాదు.. మహేష్‌ సరసన నటించేందుకు కూడా అమ్మడను సంప్రదించినట్లు సమాచారం. ఇలా టాలీవుడ్‌లో వరుస అవకాశాలు వస్తున్నాయి.టాలీవుడ్‌లోనే కాదండోయ్‌.. బాలీవుడ్‌ నుంచి కూడా అవకాశాలు వస్తున్నాయి. ఇదే ఇప్పుడు అమ్మడకు సమస్యగా మారింది. పెద్ద అవకాశాలని బాలీవుడ్‌ అవకాశాలను ఒప్పుకోవాలా? లేదా బాగా కలిసొస్తున్న టాలీవుడ్‌కే పచ్చజెండా ఊపాలా అన్నదానిపై అమ్మడు కన్‌ఫ్యూజన్‌ అవుతోందట. ఒకవైపు మొగ్గు చూపుతే మరో వైపు ఉన్న సినిమాలను ఒదులుకోక తప్పని పరిస్థితే అమ్మడు కన్‌ఫ్యూజన్‌కు కారణంగా ఉంది. అయితే అమ్మడు మాత్రం చివరకు టాలీవుడ్‌లోనే ఉండిపోవాలనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఇప్పటికే ఇక్కడ మూడు భారీ అవకాశాలు చేతిలో ఉండటంతో అవి హిట్టైతే మరిన్ని అవకాశాలు వచ్చే అవకాశాలు ఫుష్కలంగా ఉండటంతో అమ్మడు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమచారం.