English | Telugu

దాసరి సినిమాకు పవనే డైరెక్టర్..!!

పవన్ కళ్యాణ్, దాసరి నారాయణ ఎప్పుడు వుంటుందో తెలియదుగానీ, ఈ సినిమాపై రోజుకో వార్త బయటకు వస్తోంది. నిన్నటి వరకు ఈ సినిమాకు పూరి దర్శకత్వం వహిస్తాడని వార్తలు వచ్చాయి. అయితే తాజాగా మరో న్యూస్ బయటకు వచ్చింది. పవన్-దాసరి సినిమాకు డైరక్టర్ పవనే నట. పవన్ ఎప్పుడో అనుకున్న సత్యాగ్రహి స్టోరీని ఇప్పుడు తీయబోతున్నాడట. దీనికి దాసరి కూడా ఒకే అనడంతో ఇద్దరి మధ్య ఒప్పదం కుదిరిందని అంటున్నారు. ఈ సినిమాను గోపాల గోపాల మాదిరిరిగా పార్టర్నర్ షిప్ గా నిర్మిస్తారట. పవన్ హీరో, డైరక్టర్ కాబట్టి మిగిలిన స్టార్ కాస్ట్, ప్రొడక్షన్ దాసరి వంతు. కానీ ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుందన్నదే పెద్ద సమస్య.