English | Telugu

మోడల్‌ తో మెగా హీరో రొమాన్స్..?

ముకుంద‌తో ఎంట్రీ ఇచ్చిన వ‌రుణ్‌.. ఇప్పుడు క్రిష్‌తో జ‌త‌క‌ట్ట‌బోతున్న సంగ‌తి తెలిసిందే. ఈనెల 27న ఈ చిత్రం లాఛ‌నంగా ప్రారంభం కాబోతోంది. ఈ సినిమాకి సంబంధించిన ఎక్స్ క్లూజీవ్ డిటైల్స్ ఏంటంటే.. ఇది ఓ సైనికుడి ప్రేమకథట. అలాగే వరుణ్‌తో రొమాన్స్‌ చేయడానికి ఫెమినా మిస్ ఇండియా పోటీల్లో పాల్గొన్న ప్రగ్య జైస్వాల్‌ను తీసుకున్నట్లు సమాచారం. మోడల్‌గా తనకంటూ ముద్ర వేసుకున్న ఈమె గతంలో ‘మిర్చి లాంటి కుర్రాడు’ మూవీలో నటించింది. ఈ ప్రాజెక్ట్‌లో ఛాన్స్ దక్కించుకున్నందుకు హ్యాపీగా వుందని ప్రగ్య జైస్వాల్ చెప్పుకొచ్చింది.