English | Telugu

తార‌క్ చిత్రానికి రెహ‌మాన్ స్వ‌రాలు!?

`సూప‌ర్ పోలీస్`, `నీ మ‌న‌సు నాకు తెలుసు`, `నాని`, `ఏ మాయ చేసావె`, `కొమ‌రం పులి`, `సాహ‌సం శ్వాస‌గా సాగిపో`.. ఇలా ప‌రిమిత సంఖ్య‌లోనే తెలుగు చిత్రాల‌కు సంగీత‌మందించారు స్వ‌ర‌మాంత్రికుడు ఎ.ఆర్. రెహ‌మాన్. వీటిలో `సూప‌ర్ పోలీస్`, `కొమ‌రం పులి` మిన‌హాయిస్తే.. మిగిలిన‌వ‌న్నీ త‌మిళంలో సమాంత‌రంగా బైలింగ్వ‌ల్ గానో, ఇంకో వెర్ష‌న్ గానో తెర‌కెక్కిన చిత్రాలే కావ‌డం గ‌మ‌నార్హం.

Also Read:'రాధేశ్యామ్'కి పోటీగా సూర్య మూవీ.. 'ఈటీ' రిలీజ్ డేట్ వచ్చింది!

ఇదిలా ఉంటే.. త్వ‌ర‌లో ఎ.ఆర్. రెహ‌మాన్ ఓ తెలుగు చిత్రానికి బాణీలు అందించ‌నున్నార‌ట‌. అది కూడా ఓ క్రేజీ ప్రాజెక్ట్ కోసం. ఆ వివ‌రాల్లోకి వెళితే.. యంగ్ టైగ‌ర్ జూనియ‌ర్ ఎన్టీఆర్ హీరోగా `ఉప్పెన‌` ఫేమ్ బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో ఓ స్పోర్ట్ప్ డ్రామా రూపొంద‌నుంది. పాన్ - ఇండియా ప్రాజెక్ట్ గా తెర‌కెక్క‌నున్న ఈ సినిమాకి `పెద్ది` అనే టైటిల్ కూడా వినిపిస్తోంది. అంతేకాదు.. ఇందులో అతిలోక సుంద‌రి శ్రీ‌దేవి త‌న‌య జాన్వీ క‌పూర్ నాయిక‌గా న‌టించే ఛాన్స్ ఉంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. లేటెస్ట్ బ‌జ్ ఏంటంటే.. ఈ మూవీకి ఎ.ఆర్. రెహ‌మాన్ స్వ‌రాలు స‌మ‌కూర్చే అవ‌కాశ‌ముంద‌ని వినిపిస్తోంది. మ‌రి.. ఈ క‌థ‌నాల్లో వాస్త‌వ‌మెంతో తెలియాలంటే కొన్నాళ్ళు వేచిచూడాల్సిందే.