English | Telugu

మెగా టైటిల్ ఫిక్స్ అయ్యింది!

చిరంజీవి రీఎంట్రీ ఇస్తూ నటిస్తున్న మెగా 150వ చిత్రానికి తొలుత "కత్తిలాంటోడు" అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్లు వార్తలు వచ్చాయి. ఏకగ్రీవంగా తెలుగు సినిమా అభిమానులందరూ "బాలేదు" అని చెప్పడంతో నిర్మాత రామ్ చరణ్ మొన్న ఫేస్ బుక్ లైవ్ చాట్ సెషన్ లో కూడా "ఆ టైటిల్ ఫిక్స్ కాదు, వేరే టైటిల్ ఆలోచిస్తున్నాం" అని తెలిపారు.

తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రానికి "ఖైదీ నెం.150" అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. చిరంజీవి మునుపటి చిత్రాలు "ఖైదీ, ఖైదీ నెం.786" చిత్రాలు ఘన విజయం సాధించి ఉండడంతోపాటు ప్రస్తుతం నటిస్తున్న సినిమా కథ మొత్తం ఖైదీ పాత్రధారి చుట్టూనే తిరగడం, చిరంజీవి నటిస్తున్న 150వ సినిమా కావడం వంటి విషయాలను దృష్టిలో ఉంచుకొని ఈ చిత్రానికి "ఖైదీ నెం.150" అనే టైటిల్ అయితే పర్ఫెక్ట్ గా ఉంటుందని అందరూ ఫిక్స్ అయ్యారని సమాచారం అందుతోంది. అయితే.. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం మరియు అఫీషియల్ ఇన్ఫర్మేషన్ త్వరలోనే చిత్ర నిర్మాత రామ్ చరణ్ ప్రకటిస్తాడు!