English | Telugu
బాబాయిపై అబ్బాయిదే మెజార్టీ..!!
Updated : Jan 7, 2016
ఈ సంక్రాంతికి టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద నాలుగు సినిమాలూ పోటీలో ఉన్నా జనం మాత్రం నందమూరి హీరోల సినిమాల గురించే మాట్లాడుకొంటున్నారు. "నాన్నకు ప్రేమతో'' 'డిక్టేటర్' సినిమాలు ఒక రోజు తేడాతో విడుదల కాబోతుండడంతో సినీ అభిమానులు ఏ సినిమాపై ఆసక్తి చూపిస్తారనేది హాట్ టాపిక్ గా మారింది.
ఇండస్ట్రీ వర్గాల టాక్ చూస్తే... బాలయ్య పై ఎన్టీఆరే పై చేయి సాధించేటట్టు వున్నాడు. బాలయ్య డిక్టేటర్ పై కామన్ ఆడియన్స్ ఆసక్తి చూపిస్తున్న..మెజార్టీ ఆడియన్స్ మాత్రం ఎన్టీఆర్ సినిమాపైనే ఆసక్తిగా వున్నారట. 'డిక్టేటర్' రొటీన్ కమర్షియల్ సినిమాగా కనిపిస్తుండడంతో..ప్రయోగాత్మక సినిమాగా కనిపిస్తున్న 'నాన్నకు ప్రేమతో' మీదే కామన్ ఆడియన్స్ ఆసక్తి చూపిస్తున్నారట. అలాగే "నాన్నకు ప్రేమతో'' డైరెక్టర్ సుకుమార్ కి వైవిధ్యభరితమైన సినిమాలు తీస్తాడనే మార్క్ వుండడం..ఎన్టీఆర్ కి ప్లస్ గా మారింది.
బాబాయ్..అబ్బాయ్ మధ్య వంశ అనుబంధం పక్కన పెట్టేస్తే.. బాబాయ్ పై అబ్బాయే మెజార్టీ కొట్టేస్తున్నాడు.