English | Telugu
కోట్లతో జూదం ఆడుతున్న ఎన్టీఆర్!
Updated : Jan 6, 2016
పంతానికి పోయి... పదహారు కోట్లు పోగొట్టుకొన్నాడు ఎన్టీఆర్. ఔను.. ఇది అక్షరాలా నిజం.
తన సినిమా నాన్నకు ప్రేమతో సినిమాని సంక్రాంతి బరిలో దింపాలన్న ఆశయంతో ఉన్న ఎన్టీఆర్ లాభనష్టాలను బేరీజు వేసుకోవడం లేదు. సినిమా రిలీజ్ అవ్వడమే.. తొలి విజయంగా భావిస్తున్నాడు. అందుకే బయ్యర్ల దగ్గర నుంచి అడ్వాన్సులు రాకపోయినా సినిమాని అమ్మేయండి.. అని హుకూం జారీ చేశాడు. దాంతో రూ.16 కోట్ల నష్టంతోనే ఈ సినిమా విడుదల చేస్తున్నారన్నది విశ్వసనీయ వర్గాల సమాచారం.
ఈ సంక్రాంతి బరిలో నాలుగు సినిమాలున్నాయి. అన్నింటికీ థియేటర్లు దొరకడం కష్టం. `థియేటర్లు ఇచ్చినవాళ్లకు సినిమా ఇస్తాం..` అన్న ప్రాతిపదికపైనే నాన్నకు ప్రేమతో బిజినెస్ జరిగిపోయింది. నామ మాత్రపు అడ్వాన్సులు తీసుకొని.. నాన్నకు ప్రేమతో సినిమాని అమ్మేశాడు ఎన్టీఆర్. అంటే.. సినిమా విడుదలై.. బయ్యర్లకు లాభాలొస్తే. అప్పుడు అందులోంచి కొంత డబ్బు చెల్లిస్తారన్నమాట. అంత వరకూ... నిర్మాతకు అడ్వాన్సు తప్ప ఏమీ రాదు. ఈ సినిమా కోసం రూ.50 కోట్ల వరకూ ఖర్చుపెట్టారని టాక్. అడ్వాన్సుల రూపంలో రూ.30 కోట్లు కూడా రాలేదు. శాటిలైట్... ఇంకా అమ్మలేదు. ఈ సమయంలో ఇంత రిస్క్ ఎందుకు?? అని ఆగిపోవడాకిని కూడా లేదు.
ఎందుకంటే ఆల్రెడీ థియేటర్లకు అడ్వాన్సలు ఇచ్చేశారు. 13న దాదాపు 600 థియేటర్లను బ్లాక్ చేశారు. ఇప్పుడు సినిమా కారపోతే ఆ అడ్వాన్సులు తిరిగిరావు. అవన్నీ రూ.10 కోట్లకు పైమాటే అని సమాచారం. అంటే.. ఈ సినిమా అనుకొన్న సమయానికి విడుదల చేస్తే... 16 కోట్లు, చేయకపోతే 10 కోట్లు నష్టమన్నమాట. డబ్బులు పోతే పోయాయి.. అనుకొన్న సమయానికి సినిమా విడుదల చేయడం నయం.. ఒకవేళ సినిమా హిట్టయితే.. డబ్బులు తిరిగొస్తాయి కదా. అనే మన్మకంతోనే ఈ సినిమాని విడుదల చేస్తున్నార్ట. మొత్తానికి ఎన్టీఆర్ కోట్లతో జూదం ఆడుతున్నాడు. మరి ఏం జరుగుతుందో చూడాలి.