English | Telugu

బాహుబ‌లి 1గంటా 30నిముషాలు మాత్రమే..!!

టాలీవుడ్‌లో తెర‌కెక్కుతున్న అత్యంత ప్ర‌తిష్ఠాత్మ‌క చిత్రం బాహుబ‌లి. దాదాపు 100కోట్ల బ‌డ్జెట్‌తో రెండు భాగాలుగా తెర‌కెక్కిస్తున్నారు రాజ‌మౌళి. ఇప్ప‌టికే తొలిభాగం చిత్రీక‌ర‌ణ పూర్త‌యింది. బాహుబ‌లి : ది బిగినింగ్ .. జూలై 10న రిలీజ్ కానుంది. ఈ సినిమాని తెలుగు, త‌మిళ్‌, హిందీతో పాటు ఫ్రెంచ్‌, చైనా, జ‌ప‌నీస్‌, కొరియా త‌దిత‌ర భాష‌ల్లో రిలీజ్ చేస్తున్నారు. ప్ర‌స్తుతం నిర్మాణానంత‌ర ప‌నులు శ‌ర‌వేగంగా సాగుతున్నాయి. లేటెస్ట్ అప్‌డేట్ ప్ర‌కారం ఈ సినిమా నిడివి 290 నిమిషాలు. అంటే 4 గంట‌ల 50 నిమిషాలు. రెండో భాగానికి సంబంధించిన కీల‌క‌మైన స‌న్నివేశాల్ని తెర‌కెక్కించాల్సి ఉంది. ఇప్ప‌టికే రెడీ అయిన విజువ‌ల్స్ నుంచి తొలి భాగానికి అవ‌స‌ర‌మైనంతా తీసుకుని ఎడిటింగ్ ప‌నులు పూర్తి చేస్తున్నారు. బాహుబ‌లి పార్ట్ 1 నిడివి దాదాపు 2.30గంట‌లు ఉంటుంద‌ని చెబుతున్నారు. తెలుగు, త‌మిళ్‌, హిందీ వ‌ర‌కూ ఈ నిడివితో సినిమా రన్ అవుతుంది. అయితే హాలీవుడ్ వెర్ష‌న్ మాత్రం ట్రిమ్ చేస్తారు. పాట‌లు, సెంటిమెంటు సెంటు స‌న్నివేశాలు క‌ట్ చేసి సింపుల్‌గా 1.30 గంట‌లు మాత్ర‌మే సినిమాని ప్ర‌ద‌ర్శించేలా చూస్తారు. ప్ర‌స్తుతం కేన్స్ చ‌ల‌న‌చిత్రోత్స‌వాల్లో ఈ సినిమాని మార్కెట్ చేయ‌డానికి రంగం సిద్ధం చేస్తున్నారు. హాలీవుడ్ మార్కెట్‌ని అందుకోవాలంటే అక్క‌డ ప్ర‌చారం చాలా ముఖ్య‌మ‌ని భావించి చిత్ర‌నిర్మాత శోభు యార్ల‌గ‌డ్డ అక్క‌డే పాగా వేశారు. ఫ్రెంచి వీధుల్లో కాఫీ షాప్‌ల‌తో టైఅప్‌లు పెట్టుకుని బాహుబ‌లి లోగోలు ముద్రించిన టీష‌ర్టులు పంచి పెడుతున్నారు. వీలున్న‌ చోట‌ల్లా ప్ర‌చారం చేసేస్తున్నారు. అదీ సంగ‌తి.