English | Telugu
నిజజీవిత పాత్రల్లో మీనా, నైనికా?
Updated : Aug 13, 2021
బాలనటిగా కెరీర్ ని ఆరంభించి.. కథానాయికగా టర్న్ అయ్యారు మీనా. 90ల్లో తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్ గా రాణించిన మీనా.. 2009లో విద్యాసాగర్ ని పెళ్ళాడారు. ఆపై 2011లో నైనికా అనే పండంటి బిడ్డకు జన్మనిచ్చారు మీనా. తల్లిలాగే నైనికా కూడా చైల్డ్ ఆర్టిస్ట్ గా సందడి చేశారు.
2016లో విజయ్, సమంత, ఎమీ జాక్సన్ ప్రధాన పాత్రల్లో నటించిన తమిళ చిత్రం `తెరి` (తెలుగులో `పోలీస్`)తో బాలనటిగా తొలి అడుగేసిన నైనికా.. అందులో విజయ్ కూతురి పాత్రలో ఆకట్టుకుంది. ఆపై అరవింద్ స్వామి, అమలా పాల్ జంటగా నటించిన `భాస్కర్ ఒరు రాస్కెల్` (2018) చిత్రంలోనూ సందడి చేసింది నైనికా.
కట్ చేస్తే.. త్వరలో నైనికా మరో తమిళ సినిమాలో నటించబోతోందట. ఇందులో మీనా కూడా నటించబోతున్నారని సమాచారం. అంతేకాదు.. తల్లీకూతుళ్ళ పాత్రల్లోనే మీనా, నైనికా కనిపించబోతున్నారని బజ్. త్వరలోనే మీనా, నైనికా కాంబో మూవీపై క్లారిటీ రానుంది. మరి.. నిజజీవిత పాత్రల్లో మీనా, నైనికా ఏ స్థాయిలో మెస్మరైజ్ చేస్తారో చూడాలి.
కాగా, మీనా నటించిన తాజా తెలుగు చిత్రం `దృశ్యం 2` విడుదలకు సిద్ధమైంది. ఇందులో తన లక్కీ హీరో విక్టరీ వెంకటేశ్ కి జోడీగా నటించారామె. మలయాళంలో తను పోషించిన పాత్రనే ఇందులోనూ చేశారు మీనా.