English | Telugu
మెగాస్టార్ కు మిత్రవింద షాక్!
Updated : Jul 21, 2016
మెగాస్టార్ నటిస్తున్న తాజా చిత్రంలో ఎన్ని ట్విస్టులు ఉన్నాయో తెలియదు కానీ.. ఈ సినిమా షూటింగ్ మరియు క్యాస్టింగ్ విషయంలో మాత్రం రోజుకో ట్విస్ట్ చోటుచేసుకొంటోంది. ఇప్పటివరకూ హీరోయిన్ ఎవరనేది ఇంకా ఫిక్స్ అవ్వని ఈ సినిమాకి విలన్ ఎవరో కూడా ఇంకా క్లారిటీ లేదు. తనను సంప్రదించిన మాట నిజమే కానీ ఇప్పటివరకూ కన్ఫర్మ్ చేయలేదని స్వయంగా జగపతిబాబే మీడియాకి తెలిపాడు.
ఇకపోతే.. ఈ చిత్రంలో కథానాయికగా తొలుత నయనతార, అనుష్కల పేర్లు వినిపించినప్పటికీ తరువాత బాలీవుడ్ భామను ఎంపిక చేస్తున్నారని గుసగుసలు వినిపించాయి. ఇప్పుడు మరో వార్త సంచలనం సృష్టిస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్ గా క్రేజీ కథానాయికగా కాజల్ అగర్వాల్ ను అనుకొన్నారని, అయితే కాజల్ మరీ రెండున్నర కోట్ల రూపాయల పారితోషికం అడగడంతో ఆమె పేరును కన్సిడర్ చేయడం మానేశారట. ఈ తతంగం అంతా ఎప్పుడు జరిగిందో తెలియదు కానీ.. ఈ సినిమాలో హీరోయిన్ అండ్ విలన్ ఎప్పుడు సెట్ అవుతార్రా బాబు? అని అందరూ వెయిట్ చేస్తున్నారు!