English | Telugu

గోపిచంద్ ‘జిల్’ ఆడియో రిలీజ్ డేట్

'లౌక్యం’ సినిమాతో హిట్టుకొట్టి మంచి జోష్ మీదున్న హీరో గోపిచంద్ ఈ సారి ‘జిల్’ అంటూ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం.. 'జిల్’ పాటలను 12న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారట. 'రన్ రాజా రన్’ చిత్రానికి సంగీతం అందించిన గిబ్రన్ ఈ చిత్రానికి మూజిక్ అందించాడు. ఇందులో ‘ఊహాలు గుసగుసలాడే’ ఫేం రాశిఖన్నా హీరోయిన్ గా నటిస్తోంది.