English | Telugu

అనుష్క సైజ్ జోరో కాదట..!!

సినిమా కోసం హోమ్‌వ‌ర్క్ చేయ‌డంలో అనుష్క త‌ర‌వాతే ఎవ‌రైనా. వ‌ర్ణ సినిమా నుంచీ అనుష్క తెగ క‌ష్ట‌ప‌డుతూనే ఉంది. రుద్ర‌మ‌దేవి, బాహుబ‌లి.. రెండు సినిమాల్లోనూ క‌త్తితిప్పింది. ఒళ్లు హూనం చేసుకొంది. బ‌రువు బాగా త‌గ్గి స‌త్తా చూపించింది. ఇప్పుడు సైజ్ జోరో కోసం కూడా అలానే క‌ష్ట‌ప‌డ‌బోతోంది. ఈ సినిమా కోసం బాడీ పెంచ‌మ‌న్నాడ‌ట ద‌ర్శ‌కుడు ప్ర‌కాష్ కోవెల‌మూడి. అందుకే ఈ సినిమా కోసం మ‌రో ఇర‌వై కిలోలు పెర‌గ‌బోతోంది. స్లిమ్ అవ్వాలంటే కష్టంగానీ, ఒళ్లు పెంచాలంటే ఏం క‌ష్టం అనుకొంటున్నారా? అదీ క‌ష్ట‌మే. ప‌ద్ధ‌తి ప్ర‌కారం తినాలి. కొల‌స్ట్రాల్ లెవిల్స్ అదుపులో ఉంచుకొంటూనే బ‌రువు పెర‌గాలి. అందుకోసం అనుష్క త‌న క‌స‌ర‌త్తులు మొద‌లెట్టేసింద‌ని స‌మాచారం. దాదాపు 90 కిలోల‌కు చేరాలట. అంటే సైజ్ జోరోలో అనుష్క మ‌రింత బొద్దుగా క‌నిపించ‌డం ఖాయ‌మ‌న్న‌మాట‌.