English | Telugu
విజయశాంతితో ఒన్స్ మోర్!
Updated : Jul 13, 2016
ఓ పదేళ్ళు వెనక్కి వెళ్తే.. తెలుగు సినిమాకి సంబంధించినంతవరకూ మోస్ట్ రోమాంటిక్ కపుల్ అనగానే గుర్తొచ్చేది చిరంజీవి-విజయశాంతిలే. అప్పట్లో వాళ్ళ కాంబినేషన్ లో వచ్చిన సినిమాలన్నీ సూపర్ హిట్లే. "ఛాలెంజ్" మొదలుకొని "మెకానిక్ అల్లుడు" వరకూ సాగిన ఈ పరంపర చిరు-విజయశాంతిల కాంబినేషన్ తెలుగు సినిమా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది. ముఖ్యంగా.. "గ్యాంగ్ లీడర్" సినిమాలోని "వాన వాన వెల్లువాయే" పాటలో చిరంజీవి-విజయశాంతిల మధ్య కెమిస్ట్రీ అప్పటి కుర్రకారుని ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపేలా చేసింది.
అలాంటి సూపర్ కాంబో మరోమారు వెండితెరపై మెరవనుంది. ఆశ్చర్యం కలిగించినప్పటికీ.. ఇది నిజ్జంగా నిజం. చిరంజీవి-విజయశాంతి మళ్ళీ కలిసి నటించబోతున్నారు. వివి.వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిరంజీవి 150వ చిత్రంలో విజయశాంతి ఓ ముఖ్యభూమిక పోషించనుంది. కథలో కీలకమైన మలుపు తీసుకువచ్చే ఈ పాత్రలో ఎవర్ని నటింపజేయాలా అని చాలా రోజులు ఆలోచించిన అనంతరం చివరికి "విజయశాంతి" అయితే బాగుంటుందని ఆమెను సంప్రదించగా.. విజయశాంతి ఒకే అనడంతో అదిరిపోయే కాంబినేషన్ సెట్ అయ్యింది. మరి అప్పట్లో సంచలనం సృష్టించిన వీరి కెమిస్ట్రీ ఈ మారు ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతి కలిగిస్తుందో చూడాలి!