English | Telugu
'ఆచార్య'లో రామ్‌చరణ్ కామ్రేడ్ లుక్!
Updated : Mar 1, 2021
మెగాస్టార్ చిరంజీవి టైటిల్ రోల్ పోషిస్తోన్న చిత్రం 'ఆచార్య'. కొరటాల శివ డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్ పరిసరాల్లో జరుగుతోంది. చిరంజీవి జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తోన్న ఈ మూవీని మే14న రిలీజ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్‌పై రామ్‌చరణ్, నిరంజన్ రెడ్డి సంయుక్తంగా 'ఆచార్య'ను నిర్మిస్తున్నారు. ఇటీవల రిలీజ్ చేసిన టీజర్‌కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. టైటిల్ రోల్‌లో చిరంజీవి కనిపించిన తీరుకు ఫ్యాన్స్ సంబరాలు చేసుకున్నారు.
కాగా ఈ మూవీలో రామ్‌చరణ్ ఓ స్పెషల్ రోల్ చేస్తున్నాడు. అతను ఎలా కనిపిస్తాడో చూడాలని ఫస్ట్ లుక్ కోసం ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. వారి కోసం లేటెస్ట్‌గా చరణ్ తన ప్రి లుక్‌ను షేర్ చేశాడు. ఈ మూవీలో అతను నక్సలైట్‌గా కనిపించనున్నాడనే విషయం అతను తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా షేర్ చేసిన పిక్చర్‌తో కన్ఫామ్ అయ్యింది. అటువైపు తిరిగి ఉన్న చరణ్ భుజంపై ఓ వ్యక్తి చేయిపెట్టిన ఫొటోను చరణ్ షేర్ చేశాడు. చేయిపెట్టిన వ్యక్తి ఆచార్య అని అతని చేతికున్న రెడ్ క్లాత్ తెలియజేస్తోంది. చరణ్ చెవికి రింగ్ పెట్టుకొని ఉన్నాడు. అతని ముందు ఓ చెట్టుకు గన్ ఆనించి ఉండటం చూడవచ్చు.
ఆ ఫొటోకు, "A Comrade moment! Enjoying every moment with Dad @KChiruTweets & @sivakoratala Garu on #Acharya sets." అని క్యాప్షన్ జోడించాడు. అతను ఈ పిక్చర్ షేర్ చేయడం ఆలస్యం, సోషల్ మీడియాలో అది వైరల్‌గా మారిపోయింది.