English | Telugu

'పుష్ప' టీజ‌ర్‌.. ఫాస్టెస్ట్ 50 మిలియ‌న్ వ్యూస్!

 

అల్లు అర్జున్ లేటెస్ట్ ఫిల్మ్ 'పుష్ప' టీజ‌ర్ యూట్యూబ్‌లో అత్యంత వేగంగా 50 మిలియ‌న్ వ్యూస్‌ను క్రాస్ చేసిన టీజ‌ర్‌గా రికార్డుల్లోకి ఎక్కింది. దీంతో ఫ్యాన్స్ సోష‌ల్ మీడియాలో హంగామా చేస్తున్నారు. టాలీవుడ్‌లో 50 మిలియ‌న్ వ్యూస్ మార్కును చేరుకున్న రెండో టీజ‌ర్ 'పుష్ప‌'. ఇదివ‌ర‌కు ఈ ఫీట్‌ను సాధించింది 'ఆర్ఆర్ఆర్' మూవీకి చెందిన 'రామ‌రాజు ఫ‌ర్ భీమ్' టీజ‌ర్‌. దానికి ఇప్ప‌టివ‌ర‌కూ 50.45 మిలియ‌న్ వ్యూస్ వ‌చ్చాయి. త్వ‌ర‌లోనే ఆ రికార్డును కూడా 'పుష్ప' టీజ‌ర్ దాటేయ‌డం ఖాయం. దాంతో పాటు 'పుష్ప' టీజ‌ర్‌కు 1.2 మిలియ‌న్ లైక్స్‌తో పాటు ల‌క్ష‌కు పైగా కామెంట్స్ వ‌చ్చాయి. 

అల్లు అర్జున్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా ఏప్రిల్ 7న 'పుష్ప' టీజ‌ర్‌ను నిర్మాత‌లు రిలీజ్ చేశారు. అప్ప‌ట్నుంచీ ఈ వీడియో ఇంట‌ర్నెట్‌లో ట్రెండింగ్ అవుతూనే ఉంది. అటు ఆడియెన్స్ నుంచీ, ఇటు క్రిటిక్స్ నుంచీ దానికి సూప‌ర్బ్ రెస్పాన్స్ ల‌భించింది. ఇప్పుడు అతి త‌క్కువ టైమ్‌లో 50 మిలియ‌న్ వ్యూస్‌ను అది క్రాస్ చేసేసింది. ట్విట్ట‌ర్‌లో ఫ్యాన్స్‌ #IntroducingPushpaRaj #Fastest50MForPushpaRajIntro అనే హ్యాష్‌ట్యాగ్స్‌ను ట్రెండింగ్‌లోకి తెచ్చారు.

సుకుమార్ డైరెక్ట్ చేస్తోన్న 'పుష్ప' 2021లో ప్రేక్ష‌కులు అత్యంత క్యూరియాసిటీతో ఎదురుచూస్తున్న సినిమాల్లో ఒక‌టి. యూనిట్స్ మెంబ‌ర్స్ కొంత‌మంది కొవిడ్‌-19 పాజిటివ్‌గా నిర్ధార‌ణ కావ‌డంతో ప్ర‌స్తుతం సినిమా షూటింగ్ నిలిచిపోయింది. మూవీలో రోమాలు నిక్క‌బొడుచుకొనేలా చేసే ప‌లు యాక్ష‌న్ సీక్వెన్స్ ఉంటాయ‌ని స‌మాచారం. టీజ‌ర్‌లో కొన్నింటిని శాంపిల్‌గా చూపించారు. 

మ‌ల‌యాళం స్టార్ యాక్ట‌ర్ ఫ‌హ‌ద్ ఫాజిల్ విల‌న్‌గా న‌టిస్తోన్న ఈ మూవీలో బ‌న్నీ జోడీగా ర‌ష్మిక మంద‌న్న న‌టిస్తోంది. జ‌గ‌ప‌తిబాబు, ప్ర‌కాశ్ రాజ్‌, ధ‌నంజ‌య్‌, సునీల్‌, హ‌రీశ్ ఉత్త‌మ‌న్‌, వెన్నెల కిశోర్‌, అన‌సూయ భ‌ర‌ద్వాజ్ లాంటి పేరుపొందిన న‌టులు ఇందులో కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. దేవి శ్రీ‌ప్ర‌సాద్ మ్యూజిక్ అందిస్తుండ‌గా, మిరొస్లావ్ కుబా బ్రోజెక్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా వ‌ర్క్ చేస్తున్నారు. ఆగ‌స్ట్ 13న తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళం, హిందీ భాష‌ల్లో 'పుష్ప' విడుద‌ల కానున్న‌ది.